Vastu for Colors | ఇంటికి ఏ రంగులు పడితే అవి వేయొద్దా.. ఏ రంగు వేస్తే ఏమవుతుంది?
Vastu for Colors | సొంతిల్లు కట్టుకున్నా, అద్దింట్లో దిగాలనుకున్నా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకుంటాం. ఎందుకంటే, బయట ఎన్ని ఇబ్బందులున్నా ఇంట్లోకి రాగానే మనసు ప్రశాంతంగా మారాలి. వాస్తును బలంగా నమ్మేవారు అయితే, గోడల రంగుల విషయంలోనూ ఆ సూత్రాలనే పాటిస్తారు.
తెలుపు
ఇంట్లో అన్ని గదుల పైకప్పులకూ తెలుపు రంగే ఉండేలా చూసుకోవాలి. కారణం తెలుపు పాజిటివ్ ఎనర్జీకి సంకేతం. గదిలోని ఉష్ణోగ్రతనూ తగ్గిస్తుంది.
ఎరుపు
ఈ రంగు శక్తికి సూచన. ఒక పనిపై మమకారాన్ని చాటుతుంది. పడక గదికి కాకుండా.. వంటగది, డైనింగ్ హాల్ గోడలకు వేసుకోవచ్చు. ఎరుపు ఆకలిని కూడా సూచిస్తుంది. అందుకే చాలా రెస్టారెంట్లు అలంకరణలో ఎరుపు థీమ్‌ను ఎంచుకుంటాయి.
నీలిరంగు
ఆకాశం నీలిరంగులోనే ఉంటుంది. ఈ వర్ణం ప్రశాంతతకు ప్రతీక. ఇంట్లో పడకగది గోడలకు నీలిరంగు వేస్తే మనసు మహా ప్రశాంతంగా మారుతుంది. వాస్తు ప్రకారం పశ్చిమాన్ని చూసే ఏ గోడకైనా నీలిరంగు వేసుకోవచ్చు.

పసుపు
పసుపు రంగు మనోల్లాసానికి, విజ్ఞతకు సూచిక. ఈ వర్ణాన్ని స్టడీ రూమ్‌లో ఉపయోగించాలి. పసుపు వన్నె పిల్లల మనో సామర్థ్యాన్ని పెంచుతుంది. పూజ గదిలోనూ వాడొచ్చు.

ఆకుపచ్చ
ఈ రంగు ఎక్కువగా దవాఖాన గోడలకు కనిపిస్తుంది. ఇంట్లో హాలు, బెడ్రూమ్ గోడలకు ఎంచుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పడకగదికి ఈ రంగు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. దాంపత్య జీవితంలో చిన్నచిన్న సమస్యలు ఎదుర్కొంటున్న వారు కూడా, బెడ్రూమ్కు ఆకుపచ్చ రంగు వేయిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని అంటారు.
Read More :
Vasthu Shastra | మహాభారత గ్రంథం ఇంట్లో ఉంటే అన్నదమ్ములు విడిపోతారా?”
“Vasthu Shastra | మన కష్టాలకు ఇతరులు కారణమా? లేదంటే, మన ఇల్లు కారణం అవుతుందా?”
Vasthu Shastra | మాది తూర్పు ఇల్లు. సెల్లారు ఉంది. ఎటువైపు స్థలం కలుపుకోవచ్చు?”
Vasthu Shastra | ఇంటికి పెద్ద గదులు ఏ దిక్కులో ఉండాలి? పెద్ద హాలు ఉత్తరంలో ఉండకూడదా?”
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

