Vasthu Shastra | మన కష్టాలకు ఇతరులు కారణమా? లేదంటే, మన ఇల్లు కారణం అవుతుందా?
Vasthu Shastra | మన కష్టాలకు ఇతరులు కారణమా? లేదంటే, మన ఇల్లు కారణం అవుతుందా?
– ఎం. వాణి, మేడ్చల్
చాలామంది తమకు ఎదురయ్యే సమస్యలన్నిటినీ ఎదుటివారి మీదికి నెట్టేస్త్తూ ఉంటారు. లేదంటే, తమకు అదృష్టం లేదని సర్దుకుంటారు. కానీ, తమ
ప్రారబ్దాలు, స్వయంకృతాపరాధాలతోనే ఆపదలు, సమస్యలు వస్తున్నాయని ఆలోచించరు. ‘మన పనులే మనకు సంకెళ్లు’ అనేది అర్థం చేసుకోవాలి. ఇల్లు కారణం ఎప్పుడు అవుతుందంటే.. ఇంటిని ఇష్టాయిష్టాలతో కట్టుకుంటారు. ఏ పనికైనా.. ‘ఇది చేయదగినదా?’ కాదా? అని ఆలోచించరు. అవసరం, ఇష్టం అనేవి వ్యక్తి కష్టాలకు ప్రధాన భూమికలు అవుతాయి. ఈ ఇల్లు నచ్చింది, ఈచోట మంచి ‘వ్యూ’ ఉందని (ఆ అందమైన నైరుతి లోయ పాతాళంలోకి తీసుకెళ్తుంది అని చెప్పినా వినరు) వెంటనే కొనేస్తారు. మనసే చెడ్డ ఇంటిని కొనిపిస్తుంది. చెడు పనులు మళ్లీమళ్లీ చేయిస్తుంది.

నైరుతి గోడ గుండ్రంగా కట్టొచ్చా? నైరుతి హద్దుమీద ఇల్లు ఉన్నది. పక్కన మురికి కాలువ ఉంది. ఇలా ఉంటే మంచిదేనా?
– బి.సరిత, సంగారెడ్డి
ఇంటి పరిసరాలు ఎప్పుడూ బాగుండాలి. ముఖ్యంగా మురికి కాలువలు, చెత్త కుప్పలు, పెంట కుప్పలు, మురుగు నీటి నిలువలు ఉండకుండా చూసి కట్టుకోవాలి. మీ గృహానికి హద్దు ఉందని, దానికి దక్షిణం కాలువ ఉందని అంటున్నారు. అది చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రధానంగా ఇంటి సభ్యులకు అనారోగ్యాలు, ఆపరేషన్లు, కీళ్ల సమస్యలు అధికంగా ఉంటాయి. మీరు అవకాశం చూసుకొని ఇల్లు మారడం మంచిది. కాలువను ఆనుకొని ఉన్న మహల్ కన్నా దూరంగా ఉండే గుడిసె చాలా గొప్పది. ఇకపోతే నైరుతి గోడ గుండ్రంగా కట్టకూడదు. కోణంతోనే ఉండాలి. కొన్ని చౌరస్తాల్లో మూలలు గుండ్రంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మున్సిపల్ వారు కూడా అలా సూచనలు చేస్తుంటారు. అలాంటప్పుడు లోపలిభాగం మూలమట్టానికి కట్టుకొని, బయటివైపు ‘గుండ్రంగా’ చేసుకోవచ్చు.

మా ఊరి చుట్టూ కోటగోడ ఉంది. అలాంటి ఊరిలో ఉండకూడదని అంటున్నారు. నిజమా?
– ఎ. యశోద, కొడంగల్
ఆ అభిప్రాయం పూర్తిగా తప్పు. వాస్తు సమ్మతమూ కాదు. ఆనాటి పాలకులు వివిధ కారణాలతో తమ ప్రాంతం లేదా గ్రామం చుట్టూ ప్రాకారాలు కట్టేవారు. దీనివల్ల దోపిడి ముఠాల నుంచీ, శత్రు రాజ్యాల నుంచీ రక్షణ లభించేది. శాంతిభద్రతల సమస్య కూడా ఉండేది కాదు. ఇదీ ఆనాటి పాలనా దక్షత. అలాంటి ప్రాంతాలలో ఇప్పుడు ప్రజలు ఇండ్లు కడుతున్నారు. ఊళ్లకు గోడలు, బురుజులు ఉండటం చాలా సాధారణం. అలాగని ఆ పల్లెల్లో, ప్రాంతాల్లో ఇండ్లు కట్టొద్దనడం ‘తెలియని తనం’. మీరు మీ ఇంటి స్థలాన్ని ఎంచుకొని మంచి కాంపౌండుతో శాస్త్రబద్ధంగా కట్టుకోండి. మనం ఉంటున్న ఊరికి ప్రాకారం ఇంకా చెదిరి పోకుండా ఉందంటే మంచిదే కదా! శుభం కలుగుతుంది.

వాయవ్యం ఎంత ఎత్తు ఉండొచ్చు? మాకు ఉత్తరం, పడమర రోడ్లు ఉన్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయి? దయచేసి చెప్పండి.
– ఎం. కోమలి, చాడ
ఈ బ్లాకు ఆగ్నేయం బ్లాకు కన్నా ఫలితాలలో ముందు ఉంటుంది. దానికి ఉన్న వీధులలో ఉత్తరం, ఈశాన్యం పెరిగి, విశాలమైన వీధి అయితే చాలా మంచిది. ఈ బ్లాకు
ఫలితాలు స్త్రీలమీద, ఇంటిలోని మూడవ సంతానం మీద ఉంటాయి. చివరి సంతానంపైనా ఉండవచ్చు. ఈ బ్లాకులోని ఆయా దిక్కుల మూలలు పెరగడం, తరగడం మీద ముఖ్యంగా ‘శత్రు – మిత్ర’ ఫలితాలు ఉంటాయి. వాయవ్యం పెరిగితే తగాదాలు, కోర్టు వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. వాయవ్యం ఎత్తు అనేది నైరుతి, ఆగ్నేయ భాగం కన్నా పల్లంగా ఉండాలి. ఈశాన్యం కన్నా ఎత్తుగా ఉండాలి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read More :
Vasthu Shastra | మా స్కూలు భవనం పడమర ముఖంగా ఉంది. సాంస్కృతిక వేదిక’ ఎటువైపు కట్టాలి?
Vasthu Shastra | ఇంటికి పెద్ద గదులు ఏ దిక్కులో ఉండాలి? పెద్ద హాలు ఉత్తరంలో ఉండకూడదా?
Vastu Shastra | మేం కుండలు తయారు చేస్తాం.. మాకు కూడా వాస్తు వర్తిస్తుందా?
నా తరువాత నా పిల్లలకు ఇల్లు చెందాలంటే ఏ పేరుతో కట్టాలి.
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
- Tags
- Vasthu
- Vasthu Shastra
- vastu
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

