Vasthu Shastra | ఇంటికి పెద్ద గదులు ఏ దిక్కులో ఉండాలి? పెద్ద హాలు ఉత్తరంలో ఉండకూడదా?
Vasthu Shastra | ఇంటికి పెద్ద గదులు ఏ దిక్కులో ఉండాలి?
– జి. ఉపేంద్ర, ఆలేరు.
గృహాన్ని విభజించే ముందు.. ఇంటికి పడమర, దక్షిణం దిశలలో పెద్ద గదులకు కొలతలు స్థిరపరచాలి. ఉత్తరం – తూర్పు విశాలంగా ఉండాలి. తూర్పు నుంచి వస్తారు కాబట్టి, రాగానే పెద్ద హాలు కనబడాలని ఇష్టాన్ని బట్టి ఇంటిని విభజించకూడదు. ఇంటి గర్భాన్ని కలుపుతూ, నిలుపుతూ ఆచోట నిర్మాణం రాకుండా విశాలమైన హాలు వచ్చే ‘గృహం నక్ష’ తెంపాలి. ఇంటి రహస్యమంతా ‘గర్భకోశం’లోనే ఉంటుంది. మనిషి శరీరంలో మెదడు గొప్పదే కానీ, ‘జఠరాగ్ని’ ప్రధానం. ‘కుక్షిలేక మనోదక్షత’ ఉండదు. మీరు పడమర భాగాన్ని పెద్ద గదులతో, గృహ మధ్య భాగాన్ని హాలుతో, తక్కువ కొలతలతో కూడుకున్న గదులతో తూర్పు – ఈశాన్యం పూజ, వంట గదులను ప్లాను చేసుకోండి. ఉత్తరం వీధి వస్తే.. ఈ విభజన దక్షిణం నుంచి చేసుకుంటూ రండి. తెలిసినవారితో ‘గృహం నక్ష’ తయారు చేసుకొని, ‘పూర్వ కర్మల దోషాన్ని’ అరికట్టుకోండి.

పెద్ద హాలు అనేది ఇంటికి ఉత్తరంలో ఉండకూడదా?
– డి. శ్రీపతి, భువనగిరి.
ఒక సంపూర్ణ గృహం కట్టడం వేరు. ఉన్నంతలో ఒక పడక గది, కిచెన్, టాయిలెట్ పెట్టుకొని హాలు వేయడం వేరు. చిన్న గృహాల శైలి, ‘రాజమహల్’ శైలి వేరుగా ఉంటాయి. శాస్త్రం అన్ని ఇండ్లకు వర్తించినా, నిర్మాణ విశేషాలు, స్థలం-విభజనల మీద ఇంటి ఆకృతి మారుతుంది. అందుకే ఇంటిని ‘గజరూపం’, ‘సింహ స్వరూపం’.. మొదలైన పోలికలతో వ్యవహరిస్తారు. గృహ శాస్త్రంలో ‘రూప.. స్వరూప భేదాలు’ ఎన్నో ఉంటాయి . మీది చిన్న ఇంటి ప్లాను. దక్షిణం వైపు గదులు, ఉత్తరం వైపు హాలు వేసుకోవడం ‘దోషం కాదు’. పడమర – దక్షిణ నైరుతిలో పడకగది స్థల కొలతను బట్టి నిర్మించి, దక్షిణం మధ్య ‘టాయిలెట్’ పెట్టి, ఆగ్నేయంలో కిచెన్ పెట్టండి. ఆగ్నేయంలో కిచెన్ పడమర గోడ పారుతో ఉత్తరం హాలుకు ఈశాన్యంలో చిన్న ఆర్చి కట్టండి. ఆ శాస్త్ర గృహమే మిమ్మల్ని మరో విశాల భవనానికి చేర్చగలదు.
కాంపౌండు అవతల స్టాఫ్ గదులు ఎక్కడైనా కట్టుకోవచ్చా? కాంపౌండ్ లోపలే కట్టుకోవాలా?
– కె. శ్రీశైలం, ఉప్పలపాడు.
‘ఉప గదులు’.. ఎన్నో రకాలుగా వాడుకోదగిన నిర్మాణాలు. వాటి ఉపయోగాలు ఎన్ని ఉన్నా, అవి ఉండే స్థానాలు ముఖ్యం. ఇంటి కాంపౌండు అవతల కట్టాలనుకుంటే వాస్తు పాటించాల్సిన అవసరం లేదని అనుకోవద్దు. ఎక్కడ ఉన్నా మనవాళ్లు వాటిని వాడుకుంటారు. వాళ్లు మనవద్ద పని చేస్తారు. కాబట్టి ప్రహరీ అవతల ఆగ్నేయంలో స్థలం ఉంటే, అక్కడ మన ఇంటి కాంపౌండు తగలకుండా.. ఒక గది కట్టొచ్చు. దానిలోనికి బయటి నుంచి వెళ్లాలి అలాగే ఉత్తర వాయవ్యంలో ఇంటి ఆవరణం బయట ఉప గదులు కట్టొచ్చు. అప్పుడు ఇంటి ఉత్తరం లేదా ఉత్తర ఈశాన్యం గేటు నుంచి రాకపోకలు చేయవచ్చు. ఎవరి గది వారికి స్వతంత్రంగా ఉండటం ప్రధానం.

సంపుల పై ఇల్లు కట్టుకుంటే దోషమా? ఇది వాస్తు నియమాలకు విరుద్ధమా?
– వి. అమృత, కొంపల్లి.
ఇంటి నిర్మాణం చేసేటప్పుడే అవసరాలకు ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వదలాలి. తూర్పు – ఉత్తరాలలో ఎక్కువ స్థలం వదలడం వల్ల నీళ్ల సంపులు, సెప్టిక్ ట్యాంకులు కట్టుకొనే అవకాశం ఉంటుంది. కింద సంపులు ఈశాన్యం భాగంలో ఏర్పాటు చేసుకోవచ్చు. తూర్పు- ఉత్తరం దిశల్లో సంపులు కట్టి పైన నివాసం ఉండటం వల్ల దోషం ఏమీ రాదు. కానీ, కింద ఇంటి ఆవరణంలో సంపులు కడితే కింద వచ్చే గదులు, వాటి ద్వారాలు ఆ సంపులకు ఎదురుగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల వసతులకు ఎంతో ఇబ్బంది. కింద వాహనాలను పార్కింగ్ చేయాలన్నా సమస్యలు వస్తాయి. ఇంటి చుట్టూ ఖాళీ భాగం సంపులకు శ్రేష్ఠం. అదికూడా ఈశాన్యం అయితే మరీ మంచిది. ఈ నియ మాలను తప్పక గుర్తుపెట్టుకోండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

