Vasthu Shastra | మాది తూర్పు ఇల్లు. సెల్లారు ఉంది. ఎటువైపు స్థలం కలుపుకోవచ్చు?
మాది తూర్పు ఇల్లు. సెల్లారు ఉంది. ఎటువైపు స్థలం కలుపుకోవచ్చు? పక్కవాళ్లు ‘జాగ’ అమ్ముతున్నారు.
– జి. రాధ, మారేడుపల్లి.
సెల్లారు ఉన్న ఇల్లు గురించి చెప్పాలంటే.. ‘అది ఏదో ఒక విధమైన సమస్యలతో ఉంటుంది’ అని చెప్పొచ్చు. పైగా మీది తూర్పు ఇల్లు అంటున్నారు. కాబట్టి దానికి సెల్లారు నిషేధం. మనిషి భూమిని తవ్వి, అందులో జీవించే జీవ లక్షణం కలవాడు కాదు. కేవలం పంచభూతాల ప్రాంగణంలో.. వాటి ఆవరణంలో జీవనం గడపగల యోగ్యత గలవాడు. ‘ఉభయచర జీవి’ కాడు. ముఖ్యంగా సెల్లారు ఉన్న ఇల్లు ఉత్తరం స్థలం మంచిదని కొనడం సరికాదు. దాన్ని కొని కాంపౌండు కలిపితే దక్షిణం గొప్ప అవుతుంది. తూర్పు స్థలం కొన్నా పడమర దిశ ‘లోయ’ అయిపోయి, నీచ స్థానంలో గృహం ఉంటుంది. ముందుగా మీ ఇంటికి పడమర స్థలం విశాలంగా ఉంటే.. అటు ఒక రోడ్డు చేసుకొని దాని గుండా సెల్లారులోకి వెళ్లండి. కారణం మీ ఇంటికి సెల్లారు ఉంది. ఏ దిక్కు స్థలం కూడా కొనవద్దు.

ఇంట్లో మూలలు అన్నీ సమంగా ఉండాలా? ఏదైనా పెరిగి ఉండవచ్చా?
– కె. రత్నకుమారి, వరంగల్.
పెరాలసిస్, క్యాన్సర్, ఎయిడ్స్.. మొదలైన మందులకు అందని వ్యాధులు కొందర్ని బాధిస్తూ ఉంటాయి. ఆ కుటుంబాలు ఉండే ఇండ్లను పరిశీలిస్తే.. ఆ గృహాలలో మూలలు చాలా ‘వికృతంగా’ ఉంటాయి. ఇండ్లలో మూలలు మూల మట్టానికి లేకపోతే ‘మొదటికే మోసం’ వస్తుంది. అందుకే ‘మూలం ప్రధానం’ అన్నది లోకోక్తి. ఇంటి ఆవరణ – ప్రహరీ మూలలు అలాగే, ఇంటి చుట్టుగోడ మూలలు తొంభై డిగ్రీలకు ఉన్న గృహం.. ఉన్నత ప్రగతిలో ఉంటుంది. ముఖ్యంగా ‘ఆగ్నేయం – వాయవ్యం’, ‘నైరుతి – ఈశాన్యం’ మూల కొలతలు సమానంగా ఉండాలి. మనిషి – ఆహారం లేదా వ్యవహారం చేతకాక చెడిపోతాడు. ఈ రెండు, ఆ రెండు ‘ఐ’ మూలలు మనిషిలో వికృత స్వభావాలను లేపుతాయి. అవి కుదరకపోతే ఎంతవాడైనా ఇంటి పరిధిని దాటిపోడు. ఆ గృహంలో మూలలు మూలమట్టానికి కూర్చోబెట్టాలి. దేనినీ పెంచవద్దు. జాగ్రత్త అవసరం.
నైరుతి గదికి మూడు లేదా నాలుగు ద్వారాలు పెట్టవచ్చా? అసలు, ద్వారాలకు సంబంధించి పరిమితులు ఏమైనా ఉంటాయా?
– వి. గోవింద్, ఉప్పల్
ఇంటిలో నైరుతి గదికి ఈమధ్య ద్వారాలు అధికమైపోతున్నాయి. కారణం యజమాని ఆ గదిని తన ‘విలాస-వినోద’ మందిరంగా భావిస్తున్నాడు. బాల్కనీలకు, చుట్టుపక్కలకు వెళ్లడానికి ఇష్టం వచ్చినట్టు ద్వారాలు పెడుతున్నారు. ఒక పనిలో పద్ధతిని పక్కన పెట్టి , వ్యక్తిగత ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తే.. అది పతనానికి దారితీస్తుంది. నైరుతి గది ‘గుండె లాంటిది’. దానికి ఎటుపడితే అటు ‘రంధ్రాలు’ పెట్టవద్దు. దీనివల్ల ‘ఆయుష్షు’ రోజులలోకి కుదించబడుతుంది. కొందరు అదే పనిగా నైరుతి పడక గదికి పడమరలో లేదా దక్షిణంలో ద్వారం పెట్టి, ఆ బాల్కనీల్లో ‘ఉయ్యాలలు’ కట్టి ఆనందపడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. కోరిక వేరు, శాస్త్రం వేరు. శాస్త్రం హెచ్చరిస్తుంది. వినకుంటే కనిపించని ‘కరోనా’ లాగా కాటు వేస్తుంది. నైరుతి గదికి ఒకే ద్వారం ఉండాలి. అదికూడా హాలు నుంచే!

ఆశ్రమాలకు ప్రత్యేకమైన వాస్తు ఉంటుందా? లేకపోతే, ఆశ్రమ నిర్మాణంలో శాస్త్రం పాటించాల్సిన అవసరం ఉండదా? – విష్ణుశర్మ, మేడ్చల్
మఠాలు, ఆశ్రమాలు, ఆలయాలు.. వ్యక్తిగతమైన, కుటుంబగతమైన వ్యవహారాలతో ముడిపడి ఉండవు. వాటి విధులు, విధానాలు, లక్ష్యాలు వేరుగా ఉంటాయి. అవి అనుక్షణం
‘జ్ఞానవృద్ధి’కి పాటుపడుతుంటాయి. నిజానికి అవి అలౌకిక కార్యస్థలాలు. సహజంగానే వందల సంవత్సరాల నుంచీ వాస్తు బద్ధమై ఉంటాయి. ముఖ్యంగా ఆశ్రమాలకు నాలుగు వీధులు అమరి ఉంటాయి. మహాయోగులు, సర్వసంగపరిత్యాగులు సనాతన వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ.. వారివారి ఆచార కర్మాది క్రతువులను ఆచరిస్తూ, ప్రజాబాహుళ్యానికి ఆదర్శమూర్తులుగా ఉంటారు. కాబట్టి, ఆ స్థానాలు ‘లోపాలతో ఉండవు’. అయితే వాస్తు అనేది ఆశ్రమాలకు పనికిరానిది కాదు. ‘ప్రాణానికి శరీరం’ ఎట్లాంటిదో, ఆశ్రమ సంప్రదాయాలకు వాస్తు అలాంటిది. కాబట్టి, ఆ పరమహంస పరివ్రాజకులకు ‘వాస్తు రక్షణ అవసరం’. కారణం, వారు లోకోద్ధరణ చేస్తారు. అలాంటివారు సర్వదా ప్రకృతి రక్షణలో ఉండటం మంచిది కదా!
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
Read More :
Vasthu Shastra | ఇంటికి పెద్ద గదులు ఏ దిక్కులో ఉండాలి? పెద్ద హాలు ఉత్తరంలో ఉండకూడదా?
Vastu Shastra | మేం కుండలు తయారు చేస్తాం.. మాకు కూడా వాస్తు వర్తిస్తుందా?
నా తరువాత నా పిల్లలకు ఇల్లు చెందాలంటే ఏ పేరుతో కట్టాలి.
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

