వాస్తు… ఇల్లు కట్టే ప్రదేశంలో ‘కొబ్బరి చెట్టు’ వస్తున్నది. దానిని ఉంచాలా? లేదంటే తీసేసి ఇల్లు కట్టుకోవాలా?
– శ్రీకాంత్, రామునిపట్ల
కొందరు కొబ్బరి చెట్టును తొలగించడానికి ఇష్టపడరు. కొన్ని ప్రాంతాల్లో అయితే కొబ్బరి చెట్లు ఉంటే ఇంటి స్థలాన్నే మార్చేస్తారు. నిర్మాణ స్థలంలో ఇంటి ప్లానుకు అడ్డురాని వాటిని.. అవి ఏ చెట్లయినా సరే తొలగించాల్సిన పన్లేదు. ముందు మీ స్థలంలో ఖాళీ ఎంత ఉందో.. అందులో ఇల్లు వస్తుందో లేదంటే, చెట్టును తప్పక తొలగించాల్సి వస్తుందో చూసుకోండి. ఆ ప్రకారం ఇంటి ప్లాను చేయించండి. బాల్కనీకి అడ్డు వచ్చినా.. ఆగ్నేయ, వాయవ్య దిశల్లో వచ్చినా చెట్టును తొలగించకుండా ఇంటిలో స్వల్ప మార్పులు చేసి కట్టుకోవచ్చు. ఇంటి నాభి, సింహద్వారం, పడక గదుల్లో రాకుండా ఉంటే.. కొబ్బరి చెట్టును ఉంచేసి, నిరభ్యంతరంగా ఇల్లు కట్టుకోవచ్చు. తప్పనిసరై తొలగించాల్సి వస్తే.. దానిని ‘రీప్లాంటేషన్’ చేయించండి. కుదిరితే మరిన్ని చెట్లు పెంచండి.
పూజలు, జపాలు అన్ని కులాలవారూ చేయకూడదని అంటారు. నిజమేనా?
– మానేరు సౌందర్య, కోదాడ

మనిషి తరించడానికి మార్గాలు అనేకం. ఆ దారిలో అందరూ నడవాల్సిందే. దానికి కులాలు, మరింకేవో పరిధులు ఉండవు. ప్రతి వ్యక్తీ తన జన్మగతంగా వచ్చిన కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తనకోసం తాను పూజలు, నిత్య ప్రార్థనలు, దేవాలయ దర్శనం.. మొదలైనవి అనుసరిస్తూ ఆధ్యాత్మిక జీవనం గడపడం చాలా అవసరం. అంటే పితృరుణం, రుషి రుణం, దేవ రుణాలు తీర్చుకోవడం ముఖ్యం. మానవుడి దృష్టి పరిమితమైంది. సంకుచి తంగానే ఆలోచిస్తాడు. అందుకే మన సంస్కృతిలో అన్ని వర్గాల ప్రజలు తరించడానికి.. అంటే, ముందు చిత్తశుద్ధిని కలిగించడం కోసం పూజా పునస్కారాలు ఆచరించాలని శాస్ర్తాలు ఏళ్లుగా చెబుతూనే ఉన్నాయి. ఎవరి స్థాయిలో వారు, ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారు వారసత్వంగా వచ్చిన ఆచారాలను, అనుష్ఠానాలను నిర్వర్తించాల్సిందే. వీటిని ఎవరూ చేయవద్దని అనరు. వాస్తవానికి మనదేశంలో ప్రతి వర్గంవారు వారివారి ఇష్టదైవాలను కొలిచే సంస్కృతి అన్నిచోట్లా ఉన్నది. వదిలేసినవారు వేరు కానీ, దేవుడికి అందరూ ప్రియమైనవారే. ఎవరికివారు తమ జీవన జ్ఞానాన్ని పెంచుకొని, ‘కర్మయోగులు’ కావాల్సిందే! అప్పుడే జన్మ వైభవం అవగతం అవుతుంది.
పడక గదిలో బీము వస్తే దోషం కదా! ఏం చేయాలి?
– వి. సత్యనారాయణ, కల్వకుర్తి

సరిగ్గా గదుల విభజన చేసి ఇంటినికడితే ఎక్కడకూడా బీములు బయటికి రావు. అన్ని విధాలా చూసుకొని.. ఏ గది ఎంత? హాల్, పడకగది, టాయిలెట్లు.. మొదలైన వాటిని ఒకటికి పదిసార్లు చూసుకొని ‘నక్ష’ను సిద్ధం చేసుకోవాలి. మీ ఇంట్లో ఏ గదిలో బీము వచ్చినా దానిని తప్పక సరిచేయాల్సిందే! పడకగదిలోనే అంటున్నారు. దాని విస్తరణ ఎంత వరకు ఉందో, ఎక్కడెక్కడ బయటికి వచ్చిందో చూసుకొని, దాని మందాన్ని బట్టి ఫాల్స్ సీలింగ్ చేయాలి. ఫాల్స్ సీలింగ్ ఒక గదిలో వేసి వదలకుండా ఇంటి మొత్తంలో ప్లాన్ చేయండి. పడక గదులు మాత్రం వేసి, మిగతా భాగం వదిలి వేయవద్దు. ఇలా చేసినా దోషం పోతుందా? పోదా అనే అనుమానం అక్కర లేదు. దోష నివారణ కోసమే ఈ డమ్మీ సీలింగులు వచ్చాయి. సీలింగ్ చేశాక దానికింద పడుకున్నా.. ఏ దోషం ఉండదు. కాబట్టి భయపడాల్సిన పనిలేదు.
వాయవ్యం తెగిన స్థలంలో ఇల్లు ప్లాన్ చేయవచ్చా? ఇంటిని కూడా కట్ చేసి కట్టాలా?
– వి. సాగర్, కార్వాన్.

ఇల్లు కట్ చేసి ఒక మూల లేకుండా గృహ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టవద్దు. మీ స్థలంలో వాయవ్యం తెగిపోయి ఉంటే.. మీ పడమర భాగంలో ఇల్లు కట్టే వెడల్పు.. ఉదాహరణకు వాయవ్యం తెగిపోగా 30 నుంచి 40 ఫీట్ల స్థలం ఉన్నట్లయితే, చక్కగా ఇల్లు ప్లాను చేయవచ్చు. అంతేగానీ, స్థలం వాయవ్యం తెగింది కదా అని ఇంటి వాయవ్యం తెంపు చేసి కట్టవద్దు. స్థలాన్ని ఈశాన్యం పెరిగేలా ‘స్థలశుద్ధి చేసి’ దానిలో ఇంటి నక్షను ప్లాన్ చేసుకోవాలి. స్థలం చిన్నగా వచ్చినా, ఇంటిని చతురస్రంగా కానీ, దీర్ఘచతురస్రంగా కానీ ప్లాన్ చేసి కట్టండి. స్థలం ‘దిశ’ సక్రమంగా ఉంటే వాయవ్యం లోపం లేకుండా ఇంటిని చక్కగా నిర్మించుకోవచ్చు. దోషం లేదు. చూసి కట్టుకోండి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
- Tags
- Vasthu
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

