Vasthu Shastra | మహాభారత గ్రంథం ఇంట్లో ఉంటే అన్నదమ్ములు విడిపోతారా?
మహాభారత గ్రంథం ఇంట్లో ఉంటే అన్నదమ్ములు విడిపోతారా?
– వి. శ్రీపతి, కొండమడుగు
మనిషి గమ్యం ఏమిటో, గమనం ఏమిటో చెప్పిన ఇతిహాసం.. ‘మహా భారతం’. ‘ఇది ఇలాగే జరిగింది’ అని చెప్పేవే ఇతిహాసాలు. నేటి యుగానికి మహర్షులు అందించిన మూడు ఆణిముత్యాలు.. రామాయణ – భారత – భాగవత గ్రంథాలు. భారతాన్ని ‘పంచమ వేదం’ అంటారు. ఏది చదివితే ఇంకొకటి చదవాల్సిన అవసరం లేదో అదే.. మహా విజ్ఞాన సర్వస్వమైన మహాభారతం. ఇది ఇండ్లలో లేకపోవడం వల్లే మన తలరాతలు ఇంత తలకిందులు అవుతున్నాయి. కేవలం ఇంట్లో పెట్టుకోవడం కాదు.. ఆమూలాగ్రం చదవాలి. ‘భగవద్గీత’లోని ఒక్కో శ్లోకం.. ఒక్కో వ్యక్తిత్వ వికాస గ్రంథం. పరదేశ కవులు వాటిని విశదీకరించి రాస్తుంటేనే.. మనం విరగబడి, ఎగబడి కొని చదువుతున్నాం. మనవైన భారత – రామాయణాలు ఇంట్లో ఉండకపోవడం నేరం. వాటిని చదవని చదువులు నిష్ప్రయోజనమే.

మా ఇంటికి దక్షిణంలో ఖాళీ జాగా ఉంది. దానికి ‘వీధిపోటు’ వస్తున్నది. ఆ ప్రభావం మా మీద పడుతుందా?
– డి. రాధాకుమారి, వరంగల్
మనకు పరిసరాలు పట్టు ఉండటం అవసరం. ఇలాంటి ఇండ్లు కొనేటప్పుడు కాస్త జాగ్రత్త పడాలి. కేవలం ఇంటిని, దాని సొగసును మాత్రమే చూసి తొందరపడవద్దు. కాస్త వెనకా ముందూ చూసుకోవాలి. మీ పక్క స్థలం ‘ఖాళీ జాగా’ అన్నారు. అది ప్రభుత్వ స్థలం. అందులో ఏ నిర్మాణం రాదని అన్నప్పుడు.. ఆ దక్షిణం ఖాళీ ప్రభావంతోపాటు దానికున్న ‘వీధిపోటు’ (అది దక్షిణ – నైరుతి వీధి కావచ్చు దక్షిణం శూల కావచ్చు) దాని ప్రభావం మీ ఇంటిమీద తప్పకుండా ఉంటుంది. ఆ ఖాళీ స్థలం వేరే వ్యక్తులదై.. వాళ్ల పేరుమీద పట్టా ఉండి, భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటారని అనుకొంటే ఫరవాలేదు. కానీ, వాళ్ల ‘గృహ నిర్మాణం’ అయితేనే మనం కుదుటపడాలి. ఆ వీధిపోటు కారణంగా వాళ్లు మాత్రం ఇల్లు కడుతారనీ, అందులోనే ఉంటారని గ్యారంటీ కూడా లేదు! పక్కన ఇల్లు రాదు అన్నప్పుడు మీరు ఇల్లు మారాల్సిందే!

దక్షిణం – తూర్పు రోడ్లు ఉన్న ఇల్లు కూతురికే ఇవ్వాలా? మగ పిల్లలకు ఇవ్వకూడదా?
– ఎం. కృష్ణమూర్తి, కొత్తకోట
స్థలం ఇంటి వారసులు ఎవరికి ఇచ్చినా ఫరవాలేదు. కానీ, కొన్ని బ్లాకులు.. ప్రధానంగా ‘దక్షిణం – తూర్పు’ రోడ్లున్న బ్లాకును ‘ఆగ్నేయ స్థలం’ అంటాం. తెలియకుండానే అది ఆడపిల్ల పేరుమీద కొనడం.. అది ‘ఆడపిల్ల’ ఆస్తిగా మారడం జరుగుతుంది. అది దాని లక్షణం. దానికి కారణం ఆగ్నేయం.. ఆడపిల్ల మీద ప్రభావం కలిగి ఉండటం. అలాగని అబ్బాయికి ఇవ్వకూడదని అనడానికి లేదు. ఎవరికైనా ఇవ్వొచ్చు, ఇవ్వకుండా ఉండొచ్చు. కానీ, ఈ బ్లాకు విషయంలో ‘శాస్త్రం చెప్పేది’ ఏమిటంటే.. ఈ స్థలానికి ఉన్న రోడ్లలో దక్షిణం రోడ్డును ప్రధానంగా చేసుకొని ఇల్లు కట్టుకోవాలి. కారణం.. ఆ రోడ్డు చిన్నది అయినా ‘రాజవీధి’ కాకపోయినా, దక్షిణమే ప్రధానంగా కట్టాలి. తూర్పునకు వీధి గేటు, ద్వారం కూడా పెట్టాలి. ఏది ఏమైనా ఆ స్థలం తప్పక దిక్సూచికి ఉన్నప్పుడే ఇల్లు కట్టాలి.

‘కోర్టు యార్డు’ మూసేసుకోవచ్చా? మాకు పైభాగం వాడుకోవాలని ఉంది.
– టి. ముకుందా రెడ్డి, మేడ్చల్
ఒక రూపంతో నిర్మితమైన భవనాన్ని మరో రూపంలోకి మార్చాలంటే దాని మూలం చెడకుండా చూసుకోవాలి. మధ్యలో బ్రహ్మస్థానం ఓపెన్ చేసి కట్టిన మీ ఇంటి (బొమ్మ చూశాను)ని సరిచేయాలంటే, ఎన్నో మార్పులు చేయాల్సి వస్తుంది. నాలుగువిదిక్కులు – ఆ దిశల గదులు పిరమిడ్ ఆకారంలో నిర్మించారు. ఒక్కసారిగా మధ్య భాగాన్ని మూసి వేస్తే ఇంటి ‘ఊపిరి స్థానం’ మూత పడుతుంది. అలా చేయాలంటే ఇంటికప్పులను పూర్తిగా సవరించాలి. మీరు స్లాబుతో పైకప్పులను ఒక సాధారణ ఇంటిలా మార్చి, అన్నిటికీ కలిపి ఒకే ఎత్తుతో కప్పు వేయాలి. అందుకు తగిన విధంగా గోడలు సవరించి, వెంటిలేషన్‌కు సంబంధించిన సవరణలు చేసుకోవాలి. వీటితో ముందుగా ఒక ప్లాన్ తయారుచేసి, తెలిసిన వారికి చూపించిన తర్వాత మార్చుకోండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read More :
Vasthu Shastra | మన కష్టాలకు ఇతరులు కారణమా? లేదంటే, మన ఇల్లు కారణం అవుతుందా?
Vasthu Shastra | మాది తూర్పు ఇల్లు. సెల్లారు ఉంది. ఎటువైపు స్థలం కలుపుకోవచ్చు?
Vasthu Shastra | ఇంటికి పెద్ద గదులు ఏ దిక్కులో ఉండాలి? పెద్ద హాలు ఉత్తరంలో ఉండకూడదా?
నా తరువాత నా పిల్లలకు ఇల్లు చెందాలంటే ఏ పేరుతో కట్టాలి.
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
- Tags
- Vasthu
- Vasthu Shastra
- vastu
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

