Vasthu Shastra | ఓపెన్ కిచెన్‌కు ఈశాన్యంలో ద్వారం పెట్టొచ్చా?
– బి. సరస్వతి, మోత్కూర్
ప్రతి గదిలో ఈశాన్యం ఉచ్ఛమైన దిశే. కానీ, అన్ని దిశల గదుల్లో ఈశాన్యం కదా అని ద్వారం పెట్టలేం. ఓపెన్ కిచెన్ అయినా దానికి ఒక పరిధి ఉంటుంది. తూర్పు ముఖం కొలతలో మూడవ భాగం కిచెన్ కట్టుకున్నా.. ఆ గదికి ఈశాన్య ద్వారం పెట్టినట్లయితే అది ఇంటికి ఆగ్నేయ ద్వారమే అవుతుంది. ఇంట్లో సాధారణ కిచెన్ అయినా, ఓపెన్ కిచెన్ అయినా బయటికి వెళ్లే ద్వారం పెట్టాలనుకున్నప్పుడు దానిని కిచెన్‌కు దక్షిణంలోనే పెట్టాలి. కిచెన్ పక్కనే ద్వారం రావాలి.. అదీ ఎడమ వైపునే అనుకుంటే, తూర్పు ముఖం కొలతలో సరిగ్గా తూర్పు సెంటర్ నుంచి ఎడమకు లేదా పూర్తి ఈశాన్యంలో ద్వారం పెట్టుకొని వాడుకోవాలి.
కోర్టు యార్డు (ఇంటి సెంటర్)లో ‘గుండ్రటి మెట్లు’ ఎటు దిక్కు నుంచి ఎక్కాలి? ఈ విషయంలో వాస్తు ఏం చెబుతుంది?
– కె. సుజాత, వైరా
మీరు పంపిన నక్ష ప్రకారం చూస్తే, పెద్ద ఓపెనింగ్ ఇంటి మధ్యలో ఇచ్చారు. అది ‘ఓపెన్ టు స్కై’. ఆ స్థానం.. ఇంటి ‘బ్రహ్మ స్థానం’ అవుతుంది. అందులో అసలు ఏ నిర్మాణం చేయకూడదు. ఏవైపు మొదలుపెట్టి ఏవైపు చేరాలి అని అడుగుతున్నారు కానీ, నిజానికి ఆ స్థానం ముందు పనికి రాదు. ఇలాంటి ‘ఛత్రశాల భవనం’లో మెట్ల స్థానం గృహంలోనే ఉండదు. కారణం.. ఇంటి నాలుగు దిక్కులలో వచ్చే గదులకు కప్పు పిరమిడ్ ఆకారంలో వేయాలి. మీరు రెండు అంతస్తులు ప్లాన్ చేశారు. కాబట్టి దక్షిణం లేదా పడమరలో మెట్లు వేయండి. తప్పకుండా దక్షిణ – నైరుతిలోని ‘మాస్టర్ బెడ్రూమ్’, వాయవ్యంలోని బెడ్ రూములకు కప్పును పిరమిడ్ ఆకారంలో వేయండి. తద్వారా తిరుగులేని శాస్త్రీయత ఏర్పడుతుంది. శుభ ఫలితాలు అందుతాయి. మధ్యలో మాత్రం మెట్లు వేయవద్దు.
ఇంటి మీద వాయవ్యంలో నీళ్ల ట్యాంకు పెట్టొచ్చా? మాది దక్షిణం ఇల్లు.
కె. రమణి, కోదాడ
నీళ్ల ట్యాంకులు నైరుతిలోనే పెట్టాలి అనేది తప్పనిసరి కాదు. ఇంటి కప్పుమీద బరువు మోసే దిశలు ఉంటాయి. అందులో ప్రధాన దిశ నైరుతి – ఆగ్నేయం – వాయవ్యం. అలాగే దక్షిణ – పశ్చిమాలు కూడా. మీది దక్షిణం ఇల్లు కాబట్టి, దక్షిణ – నైరుతిలో మెట్ల మీద కప్పు వేయండి. అప్పుడు నైరుతి ఎత్తుగా ఉంటుంది. ఇంటి మెట్ల పక్కనే నైరుతి భాగంలో దిమ్మెలు కట్టి దానిమీద సిమెంటు బిళ్లలు పోసి, నీళ్ల ట్యాంకు పెట్టండి. స్లాబు మీద ట్యాంకులు పెట్టొద్దు. కొన్నాళ్లకు లీకేజీ వచ్చి, ఇల్లు పాడవుతుంది. ఒకవేళ దక్షిణ భాగం ఒక గది రేకులతో వేయాలని అనుకున్నప్పుడు వాయవ్యంలో తప్పక నీళ్ల ట్యాంకులు పెట్టుకోవచ్చు. ఈశాన్యం దిశ తప్ప.. ఎక్కడైనా మీరు ట్యాంకు ఏర్పాటు చేసుకోవచ్చు. దోషం లేదు.
మా తమ్ముని ఇల్లు తూర్పు ముఖం. నా ఇల్లు దక్షిణం ముఖం. తమ్ముని ఇల్లు ఫ్లోరింగ్ ఎత్తు ఉంది. అది మాకు దోషమా?
– కె. ప్రవీణ్, వరంగల్
మీరు పంపిన ప్లానులో ఉన్నట్లు మీది దక్షిణం రోడ్డు. మీ తమ్మునిది తూర్పు రోడ్డు. మీరు ఇంటిని ఎప్పుడో కట్టారు. మీ తమ్ముడు ఇప్పుడే కడుతున్నాడు. పైగా ఎవరి కాంపౌండు వారిది. ఎవరి ముఖం వారిది. ఇక ఎవరి ఇంటి గురించో మీకు ఎందుకు? తూర్పు రోడ్డు ఎత్తును బట్టి అతని ఇంటి ఫ్లోరింగ్ ఉంది. మీ దక్షిణం రోడ్డు ఎత్తును బట్టి మీ ఇంటి ఫ్లోరింగ్ వచ్చింది. ఇప్పుడు మీ ఇంటి ఫ్లోరింగ్‌ను లేపగలరా? అప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి మీకు. అలా చేయలేరు. ఎవరి ప్రహరీ వారికి, ఎవరి కుటుంబం వారికి అయినప్పుడు ఎవరో ఇంటి ఎత్తుల గురించి ఆలోచించవద్దు. మీ సింహద్వారం వేరు. వారి సింహద్వారం వేరు. తమ్ముడే కాదు.. ఎవరైనా వారివారి పరిసరాలను బట్టి వారి ఇండ్లు కూచుంటాయి. పోల్చుకోవడం ఏమంత మంచి పద్ధతి కాదు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | దక్షిణం ఖాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టాలా? వద్దా?
Vasthu | జాతకాన్ని పాటించాలా? వాస్తును పాటించాలా? ఏది ముఖ్యం?
ఆలయాల గర్భగుళ్లలో వెలుతురు ఉండదు. అది వాస్తు ఎలా అవుతుంది?
Vasthu Shastra | ‘నాస్తిక వాదం’తో చూస్తే వాస్తు తప్పు అంటున్నారు. నిజమేనా?
వాస్తు ప్రకారం అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా? ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయి?