వాస్తు ప్రకారం అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా? ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయి?
Vastu and Aquarium | అక్వేరియం.. ఇంటికి అందం, ఇంట్లోవారికి ఆహ్లాదం. చిట్టి జలాశయంలో మిలమిల మెరిసే మీనాల విన్యాసాలు చూస్తూ మనసులోని బాధలన్నీ మరిచిపోవచ్చు. అయితే, గృహ అలంకరణలో భాగమైన అక్వేరియాన్ని వాస్తు దోషాలకు పరిహారంగానూ సూచిస్తున్నారు నిపుణులు. శాస్త్రం మాట ఎలా ఉన్నా.. అక్వేరియాన్ని హాల్లో గానీ, లివింగ్ ఏరియాలో గానీ పెడితే చూడముచ్చటగా ఉంటుంది. ఆగ్నేయం లేదా వాయవ్యంలో ఉంచితే పలు దోషాలు పరిహారం అవుతాయని వాస్తు నిపుణుల ఉవాచ. పడక గదిలో, వంటింట్లో అక్వేరియం అస్సలు ఉంచకూడదని చెబుతారు. అలాగే, తరచూ శబ్దాలు వచ్చే చోట కూడా పెట్టొద్దని అంటారు. అక్వేరియంలో ఎన్ని చేపలు ఉండాలో కూడా వాస్తు పండితులు చెబుతున్నారు. తొమ్మిది అయితే మంచిదట. అందులో ఒక్కటైనా గోల్డెన్ ఫిష్ ఉండాలన్నది నియమం. బంగారు వర్ణం సంపదకు ప్రతీక.
Read More :
Vasthu Shastra | మాకు ఉత్తరం రోడ్డు ఉంది. ఖాళీ జాగాలో మొత్తం షాపులు కట్టుకోవచ్చా?
Vasthu Shastra | ఇంటి నిర్మాణానికి గుండ్రంగా ఉండే స్థలం పనికిరాదా?
Vasthu Shastra | స్థలానికి వాస్తు ఉందా లేదా అన్నది ఎలా చూడాలి?
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

