Vasthu Shastra | స్థలానికి వాస్తు ఉందా లేదా అన్నది ఎలా చూడాలి?
Vasthu Shastra | స్థలానికి వాస్తు ఉందా లేదా అన్నది ఎలా చూడాలి?
– కె.అపర్ణ, బ్రాహ్మణపల్లి
ఒక మనిషి ఆరోగ్య స్థితి అతని ముఖంలో ప్రస్ఫుటమవుతుంది. అలాగే ఓ స్థల వాస్తు వైభవం ఆ మట్టిలో, అక్కడ పెరిగిన చెట్ట్టూ చేమలలో ప్రత్యక్షం అవుతుంది. ముఖ్యంగా దిశాత్మకంగా ఉన్న స్థలం గొప్ప హృదయంతో ఉంటుంది. వంకరగా ఉండే త్రిభుజాకార స్థలాలు, ఇరుకు సందుల మధ్య ఉండేవి, వీధులు వరుసగా, నేరుగా వెళ్లని కూడలి స్థలాలు ..చూడగానే మనసుకు ‘గ్లాని’ కలుగుతుంది. అలాంటి స్థలాలు హానికర లక్షణాలను కలిగి ఉంటాయి. అందరూ మనుషులే అయినా, వారివారి ‘స్వభావాలు’ వేరువేరుగా ఉన్నట్లే.. ఇంటి స్థలాలను పగటిపూట చూసి నిర్ధారించుకోవాలి. మనం చూడటం కన్నా, ‘తెలిసినవారి చేత’ చూపించుకోవడం ఉత్తమం. ఇల్లు నూరేళ్ల జీవితం కదా!

కేవలం నాలుగు మూలలు కాకుండా, మరోలా ఆఫీసు కట్టుకోవద్దా?
– బి.అంజన్ కుమార్, కొడంగల్
గృహం ఆకారం, ఆఫీసు ఆకారం ఒకేలా ఉండాలన్న నియమం లేదు. ‘ఆయం’ ప్రమాణంగా మన పెద్దలు శాస్త్రంలో కొన్ని శరీరంతో పోల్చి, ‘గణనం’ చేశారు. అలాంటి పేర్లే గజాయం, సింహాయం, వృషభాయం.. మొదలైనవి. వీటిని లోతుగా పరిశీలించి చూస్తే.. ఆకారం – కొలతలు జత చేస్తే ఎన్నో ‘వైభవ స్వరూపాలు’ బయటికి వస్తాయి. మీరు అన్నట్టు.. ‘డబ్బాలా’ నాలుగు మూలలు కాకుండా, శాస్త్ర అనుకూలంగా కొన్ని ఆమోదయోగ్య ‘రూపాలలో’ నిర్మాణాలు రూపొం దించుకోవచ్చు. ఈ పద్ధతిలో ఆఫీసులకు ఎన్నో ఆకృతులు అందుబాటులో ఉన్నాయి. లోకంలో ప్రచారం వేరు. శాస్త్రం లోతు వేరు. మీరు అనుకున్నట్టు వాస్తు చెడకుండా గొప్పగా, అద్భుతంగా కార్యాలయాలను కట్టుకోవచ్చు. ‘రూపం – స్వరూపం’ వేరువేరు. ఇవి ప్రతి వస్తువుకు, శరీరానికి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ‘నక్ష’ గీసుకొని, గొప్పగా మీ ఆఫీసు సముదాయం కట్టుకోవచ్చు.

కాంపౌండు లోపల స్విమ్మింగ్ పూల్ పెడితే ఇల్లు దాటి ఉండొద్దా?
– వి. రాము, కొరుట్ల
ఇంటి ఆవరణంలో స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేసినప్పుడు ఇంటికి తూర్పులో – ఉత్తరంలో లేదా స్థలం పెద్దగా ఉంటే ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఇంటికి దగ్గరగా కడుతున్నారు. ఇంటి ఆగ్నేయ భాగం నుంచి తప్పించి, దానిని తూర్పు మధ్యలోకి లేదా తూర్పు-ఈశాన్యం కలుపుకొని కట్టొచ్చు. అదే స్విమ్మింగ్ పూల్ జరిపినప్పుడు ఇల్లు దాటి ఉత్తరం వైపు పెరగవచ్చు. అంతేకాని దక్షిణం వైపు జరగకూడదు. అలానే ఉత్తరం మధ్య నుంచి మొదలుపెట్టి తూర్పు – ఈశాన్య భాగం వరకూ విస్తరించవచ్చు. కానీ, వాయవ్యంలోకి వెళ్లవద్దు. స్విమ్మింగ్ పూల్ మొత్తం గృహ స్థలానికి ఈశాన్యంలో వచ్చేలా చూసుకుంటే చాలు.

ఇంటిని ‘నైరుతి – వాయవ్యం’ గ్రీనరీ కోసం కట్ చేసి కట్టొచ్చా?
– కుమార్, వరంగల్
ఇంట్లోంచి చూస్తే చెట్లు కనబడాలని, గ్రీనరీ ఉండాలని ఇంటిని, ఇంటి ముఖాలను కట్ చేసి ఆ దిశల్లో ‘లాన్ – చెట్లు’ పెడుతున్నారు. ఈ విధానం అంత మంచిది కాదు. కూర్చున్న చోట అందమంతా ఆరబోసుకోవాలి అన్న మాట అన్ని చోట్లా, అన్ని దిశలకూ వర్తించదు. ముఖ్యంగా మీ ఇంటిని ‘నైరుతి – వాయవ్యం’ కట్ చేస్తే నిర్మాణం ‘టీ’ ఆకారంగా మారుతుంది. అలా ‘లాన్ కోసం’ ఇంటిని కట్ చేయాలంటే మూలలను కాకుండా దక్షిణం మధ్య లేదా పడమర మధ్య ఏదైనా ఒక్క దిశకు ‘కట్ చేసుకొని’ దానిలో చెట్లు పెంచుకోవచ్చు. ‘ఆ కటింగ్ అనేది ఇంటి గర్భం’ తెగిపోయేలా లోపలికి తీసుకురావద్దు. ఏది ఏమైనా ఇంటిని ఇంటిలాగే కట్టి, ఇంటి చుట్టూ పచ్చదనం ప్లాన్ చేసుకోవడమే ఉత్తమం.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ, suddalavasthu@gmail.com, Cell: 7993467678
Read More :
Vastu for Colors | ఇంటికి ఏ రంగులు పడితే అవి వేయొద్దా.. ఏ రంగు వేస్తే ఏమవుతుంది?
Vasthu Shastra | మహాభారత గ్రంథం ఇంట్లో ఉంటే అన్నదమ్ములు విడిపోతారా?
Vasthu Shastra | మన కష్టాలకు ఇతరులు కారణమా? లేదంటే, మన ఇల్లు కారణం అవుతుందా?
Vastu Shastra | మేం కుండలు తయారు చేస్తాం.. మాకు కూడా వాస్తు వర్తిస్తుందా?
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

