మాకు ఉత్తరం రోడ్డు ఉంది. ఖాళీ జాగా చాలా ఉంది. ఉత్తరం వైపు మొత్తం షాపులు కట్టుకోవచ్చా? దయచేసి సలహా ఇవ్వండి.
– జి. సుభద్రా దేవి, వనపర్తి
షాపులు – ఇల్లు కలిపి ప్లాను చేయాలంటే రెండిటినీ జాగ్రత్తగా విభజించాలి. ఉత్తరం వైపు షాపులు వేయాల్సి వస్తే ముందుగా దక్షిణ – పశ్చిమ నైరుతి భాగాన్ని గృహ నిర్మాణానికి కేటాయించాలి. ఉత్తరం వైపు అటు ఉత్తర వాయవ్యం నుంచి ఈశాన్యం వరకు ఉన్న స్థలాన్ని లెక్కించి ఉత్తర ఈశాన్యంలో గేటుకోసం కనీసం
‘పదిహేను’ అడుగులు వదలాలి. షాపులను ఉత్తర భాగం అంతా ఆక్రమించేలా కాకుండా.. ఇంటికి అవసరమైనంత ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, మిగతా రోడ్డు భాగం షాపులకు కేటాయించాలి. తప్పకుండా షాపుల వెనుక భాగం అంటే.. ఇంటికి ఉత్తర భాగం కాంపౌండు కట్టుకొని, షాపులు రోడ్డు ఫేస్‌తో వేసుకోవాలి. ఇల్లు-ఉత్తరం షాపులు అంటుకొని వేసుకోవద్దు. వేటికవి వేరువేరుగా ఉండాలి.
తూర్పు-ఉత్తరం రోడ్డు ఉన్న స్థలానికి సగం భాగం సెల్లార్ తీయాలంటారు. నిజమేనా?
– కె. రమ్యకృష్ణ, తేరాల
మీరు చెప్పే స్థలం ఈశాన్యం బ్లాక్. ఈశాన్యం ప్లాట్‌కు అసలు సెల్లారే పనికిరాదు. దానికి సెల్లార్ ఉండాలనే నియమం లేదు. మీరు అందులో ఇల్లు కట్టాలంటే తప్పక కారు పార్కింగ్ కోసం స్థలాన్ని తూర్పులో కానీ, ఉత్తరంలో కానీ వదులుకొని ‘నలుచదరంగా’ ఇల్లు ప్లాన్ చేసుకోవాలి. ఇంటిని కట్‌చేసి (అంటే.. ఈశాన్యం గదిని) కట్టుకోవద్దు. అది పెద్ద దోషం. కింద భాగంలో ‘స్టిల్ట్’ వదులుకొని లిఫ్టుతో పైకి వెళ్లేలా, అలాగే రోడ్డును బట్టి మెట్లు వేసుకొని పై అంతస్తులో ఇల్లు ప్లాను చేసుకోండి. సౌకర్యంగా, శాస్త్రీయంగా ఉంటుంది. ఈశాన్యం స్థలానికి సెల్లారు తీస్తే.. ఆ ‘గొయ్యి’లోకి కూరుకుపోతుంది. మన ఎదుగుదల కూడా అంతే..
ఉత్తరం వైపు ‘16 అడుగుల’ బాల్కనీ పెట్టు కుంటే వాస్తు సమ్మతమేనా?
– కె. సుమతి, ఉప్పల్
అందం కోసం, ఎలివేషన్ కోసం ఇష్టం వచ్చినంత బాల్కనీ తీసుకున్నా.. వాస్తుపరంగానే ఉండాలి. మీ ప్లాన్ ప్రకారం ఉత్తరంలో అంత విశాలమైన ‘స్లాబ్’ రావాలంటే.. దానికింద తప్పక పిల్లర్లు ఉండాలి. పైగా అంతపెద్ద బాల్కనీ వల్ల ఇంట్లో ‘వెంటిలేషన్’ తగ్గుతుంది. అనవసరంగా పెంచుకోకుండా పైన ఉత్తరం నడక వచ్చేలా అవసరమైన మేర ‘ఏడు అడుగులు’ అయినా సరిపోతుంది. ఒకవేళ పిల్లర్లు వేసుకొని ఉత్తర భాగంలో పెద్ద బాల్కనీ వేస్తే.. ఆ పిల్లర్ల అవతల దక్షిణం కన్నా ఎక్కువ ఖాళీ ఉండేలా చూసుకోండి. ఎలివేషన్ కోసం ఎక్కువ ఖర్చు.. ఎక్కువ దోషాలు చేసుకోవద్దు.
మాకు తూర్పు రోడ్డు. పడమర ఎత్తు ఉండి, ఈశాన్యం డౌను ఉంది. ఇంటి ఫ్లోరింగ్ ఎంత ఎత్తు ఉండాలి?
కె. లక్ష్మి, ఆలేరు
రోడ్డు శాస్త్ర సమ్మతంగా ఉన్నప్పుడు ఇంటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇంజినీర్లు ఈశాన్యం ద్వారం వద్ద తక్కువ ఎత్తు ఉండాలని ఫ్లోరింగ్ ఎత్తు తగ్గిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఇల్లు ఎక్కడ, ఏ మూల చూసినా రోడ్డుకంటే కనీసం ‘ఒక అడుగున్నర’ ఎత్తు ఫ్లోరింగ్ తప్పక ఉండాలి. దీనిని ఎక్కడ ఎత్తయిన భాగం ఉంటే అక్కడినుంచి లెక్కించాలి. ఎక్కువ మెట్లు ఎక్కాలనో.. ‘సింహ ద్వారం (మెయిన్ డోర్) వద్ద అందంగా ఉండదనో ఫ్లోరింగ్ చాలా తగ్గించి కడితే.. దక్షిణంలో ఇల్లు భూమిలోపలికి వెళ్తుంది. అది పెద్ద దోషం. తప్పక అన్ని జాగ్రత్తలు చూసుకొని ఇల్లు కట్టండి. ఇంటిని పాతిపెట్టినట్లు కట్టవద్దు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ఇంటి నిర్మాణానికి గుండ్రంగా ఉండే స్థలం పనికిరాదా?
Vasthu Shastra | స్థలానికి వాస్తు ఉందా లేదా అన్నది ఎలా చూడాలి?
Vastu for Colors | ఇంటికి ఏ రంగులు పడితే అవి వేయొద్దా.. ఏ రంగు వేస్తే ఏమవుతుంది?
Vasthu Shastra | మహాభారత గ్రంథం ఇంట్లో ఉంటే అన్నదమ్ములు విడిపోతారా?
వాస్తు | ఇంటిముందు వరండాకు కానీ గుండ్రటి పిల్లర్లు వేయవచ్చా? దీనివల్ల ఏమైనా దోషం ఉంటుందా?