Vasthu Shastra | ఇంటి నిర్మాణానికి గుండ్రంగా ఉండే స్థలం పనికిరాదా?
ఇంటి నిర్మాణానికి గుండ్రంగా ఉండే స్థలం పనికిరాదా?
– బి. రాధ, పోచంపల్లి
వృత్తం నిర్మాణానికి పనికిరాదు. గుండ్రని భూమిమీద దీర్ఘ చతురస్రపు, స్థూపాకారపు జీవి ఈ మనిషి. ఇతనే ఈ భూమిమీద బుద్ధి జీవిగా మనుగడ సాగిస్తున్నాడు. నేలమీద ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఆయా శరీరాలతో ఉన్నాయి. కానీ, వేటికీ.. మనిషిని మించిన తెలివితేటలు లేవు. ఇదంతా భూమ్యాకర్షణ కలిగిన ఈ సమస్థాన గ్రహంమీదనే సాధ్యం అయ్యింది. ఎంతో లోతైన శోధన తరువాతనే మన పూర్వికులు నిర్మాణాలకు చతురస్ర – దీర్ఘ చతురస్ర ఆకారం ఇచ్చారు. ఇది ఎంతో యోగ్యమైన ఆకారం. కాబట్టి, గుండ్రటి స్థలం.. గుండ్రటి ఇల్లు పనికిరావు. ఈ నియమాన్ని ఎప్పుడూ ఉల్లంఘించవద్దు.

దక్షిణ నైరుతిలో మెట్లు వేసుకోవచ్చా? కొందరు ‘వద్దు’ అంటున్నారు?
– వి. వసుధ, లద్దునూరు
దక్షిణం – పశ్చిమ నైరుతి దిశల్లో ఇంటి బయట ఇంటిని ఆనుకొని మెట్లు వేసుకోవచ్చు. ఇంటి లోపల నైరుతి దిశలో మెట్లు అసలు పనికిరావు. ఇంటి బయట ఎత్తు.. ఇంటి లోపల లోతును కలిగించే దిశ నైరుతి. దీని విషయంలో చాలామందికి సరైన శాస్త్రీయ అవగాహన లేక ఏవేవో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. మీరు దక్షిణ నైరుతిలో మడత మెట్లు వేసుకోండి. అయితే మెట్లకు పిల్లర్‌తో కాకుండా ‘కాంటి లీవర్’ బీముతో ల్యాండింగ్ నిర్మించుకొని, దక్షిణం ఆగ్నేయం నుంచి ఇంట్లోకి వెళ్లేలా నిర్మాణం జరపాలి. తప్పక మీ ఇంటికి ఉత్తరం బాల్కనీ కూడా ఉండాలి. ఉత్తరం బాల్కనీ అన్నది దక్షిణం బాల్కనీ కన్నా కాస్త వెడల్పుగా వేయండి.
ఇంటిలో కూడా మంచి నడకలు, చెడు నడకలు ఉంటాయా?
– పి. స్వప్న, తేరాల
తప్పకుండా ఉంటాయి. ఇంటిలోని నడకలు ఇంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని స్థిరపరుస్తాయి. గృహంలోని గదులు, వాటికి అమర్చే ద్వారాలు ఒక హాలు నుంచి ఒక్కో గదికి వెళ్లే మార్గం.. పోయే మార్గం ఇవి ఇంటిలో నడకల వక్రతకు మూలం అవుతాయి. తూర్పు – ఈశాన్యం నుంచి వెళ్లే నడక ఇంటి నైరుతి గదిలో నైరుతి ద్వారంగా బయటికి వెళ్లే ద్వారం అమర్చినట్లయితే చాలా దోషపూరితం అవుతుంది. అలాగే దక్షిణ ఆగ్నేయం నుంచి ఇంటి ఉత్తరంలో వాయవ్యం గుండా సాగే ద్వార బంధాలు చెడును కలిగిస్తాయి. కాబట్టి ఉచ్ఛమైన ‘వరుస ద్వారాలు’ తూర్పు – ఈశాన్యం నుంచి పడమర – వాయవ్యం, దక్షిణ – ఆగ్నేయం నుంచి ఉత్తర – ఈశాన్యం నేరుగా ఉండే ద్వారాలతో గృహం గదులు నిర్మిస్తే, ఆ గృహం నిరంతర శుభాలిచ్చే ఆలయం అవుతుంది.

వీధి చూపు ఉన్నప్పుడు దానికి ఎదురుగా ద్వారం పెట్టవచ్చా?
– కె. సుబ్బారావు, మెట్పల్లి
‘వీధి చూపు’ అంటే శుభకరమైందే కదా! దానికి సంబంధించిన అన్ని నడకలూ పనికొస్తాయి. ఇంటి స్థలానికి తూర్పు-ఈశాన్యంలో ఎదురుగా వీధి వచ్చినప్పుడు ఆ స్థలంలో ఇల్లు కడితే సహజంగానే గేటుకు అంటే… ఇంటి ఆవరణ కాంపౌండు గేటుకు ఈశాన్యంలో ఆ వీధి వచ్చి పడుతుంది. ద్వారానికి కూడా మీ వీధి చూపు ఆడుతుంది. ఆ ప్రకారంగా ఉత్తరంలో మీరు తక్కువ ఖాళీ ఇచ్చి కట్టినట్టు. ఏది ఎలా కట్టినా ద్వారం ఇంటి ఈశాన్యం వచ్చేలా కట్టి, దానికి వీధి చూపు పడటం శ్రేష్ఠం. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అలాకాకుండా, ద్వారం ఇంటి తూర్పులో పెట్టి దానికి కూడా ఎదురుగా వీధి తాకుతుందీ అంటే.. మీ వీధి చూపును మళ్లీ చెక్ చేసుకోవాలి. అది ఆగ్నేయం వీధి పోటుగా ఉందా? అని అన్నీ చూసుకొని సరిచేసుకోండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read More :
Vasthu Shastra | స్థలానికి వాస్తు ఉందా లేదా అన్నది ఎలా చూడాలి?
Vastu for Colors | ఇంటికి ఏ రంగులు పడితే అవి వేయొద్దా.. ఏ రంగు వేస్తే ఏమవుతుంది?
Vasthu Shastra | మహాభారత గ్రంథం ఇంట్లో ఉంటే అన్నదమ్ములు విడిపోతారా?
వాస్తు | ఇంటిముందు వరండాకు కానీ గుండ్రటి పిల్లర్లు వేయవచ్చా? దీనివల్ల ఏమైనా దోషం ఉంటుందా?
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

