Vasthu | మాది గచ్చు ఇల్లు. దానికి దక్షిణంలో వంటిల్లు కట్టాం. అలా ఉండొచ్చా?
-వి. సుమిత్ర, హైదరాబాద్
అప్పట్లో ఇండ్లు ఎక్కువగా గచ్చుతోనే కట్టేవారు. అవి ఎంతో శాస్త్రబద్ధమైనవి కూడా. ఒకప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గచ్చు ఇండ్లు (ఛత్రశాల) చాలా ప్రాచుర్యంలో ఉండేవి. సిమెంట్ కాంక్రీట్ కప్పు వచ్చాక వాటి ప్రాభవం తగ్గిపోయింది. మీరు మీ ఇంటిని యథాతథంగా వాడుకోవచ్చు. అయితే అదనంగా దక్షిణంలో హాలు కట్టడం మాత్రం మంచిది కాదు. దానివల్ల గచ్చు ఇల్లు దెబ్బతింటుంది. ఉన్న ఇంట్లోనే ఆగ్నేయం మూల గదిని వంటకు, ఈశాన్య గదిని డ్రాయింగ్ రూమ్‌గా వాడండి. వెంటనే మీ దక్షిణం ప్రహరీ గోడను కట్టుకోండి. గచ్చు ఇండ్లలో మూల గదులను మూతపడటంగా భావించవద్దు. నాలుగు దిశలకు ద్వారాలను అలానే ఉంచి వాడుకోండి.
వ్యవసాయ స్థలం నైరుతి భాగం పెరిగి ఉండొచ్చా?
-ఎ. కాతోజు, దిల్సుఖ్నగర్
ఇంటి స్థలం, వ్యవసాయ స్థలం విస్తీర్ణాలు విభిన్నంగా ఉంటాయి. ఎన్నో ఎకరాలు కలిగి ఉండేది వ్యవసాయ భూమి. దాని దిక్కులు, మూలలు పెరగటం, తరగటం సాధారణం. కొందరి భూములు వందల ఎకరాల్లో ఉంటే, మరి కొందరివి పదుల ఎకరాల్లో ఉండొచ్చు. అన్నిటినీ దిక్కులకు (మెట్నకు) సరిచేయాలనే విధానం అక్కరలేనిది. పైగా అసాధ్యం కూడా. మీరు ఉండే స్థలం సరిగ్గా దిశకు పెట్టుకొని అందులో ఇల్లు (ఫార్మ్ హౌజ్) కట్టండి. మిగతా వ్యవసాయ క్షేత్రం ఎలా ఉన్నా, ఎన్ని వంకరలు తిరిగినా దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఎట్లా ఉంటే అట్లా దాని హద్దులను బట్టి ఫెన్సింగ్ తీగలతో సేఫ్టీ చేయొచ్చు.
ఫార్మ్ హౌజ్‌లో ఇంటి చుట్టూ బాల్కనీ పెట్టొచ్చా? మెట్లు అడ్డు వస్తున్నాయి. ఎలా?
-బి. శ్రీకాంత్, కడ్తాల
వ్యవసాయ గృహాలకే కాదు, ఏ గృహాలకైనా మొదటి అంతస్తుకు ప్రదక్షిణం వచ్చేలా ఇంటి చుట్టూ బాల్కనీ ఏర్పాటు చేసుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసినప్పుడు, వంటగదిని ఆనుకొని రెండున్నర ఫీట్ల వెడల్పుతో తూర్పు దిక్కుకు జాగ (బాల్కనీ) వదిలి అవతలికి మెట్లు కట్టాలి. అప్పుడు ఇంటి చుట్టు తిరిగే బాల్కనీ వస్తుంది. అయితే ఇంటికి ప్రదక్షిణంగా బాల్కనీ రావాలి. అంటే చుట్టూ సమానమైన వెడల్పు బాల్కనీ వేయవచ్చు. లేదా దక్షిణం పడమర కన్నా తూర్పు ఉత్తరం పెంచుకొని బాల్కనీ వేయవచ్చు. అలానే, బాల్కనీ నీరు వాస్తుపరంగా తగిన దిశలకు వెళ్లే విధంగా వాలు చేసుకోవాలి.
మాది పడమర ఇల్లు. సెల్లారు ఇంటికింద తీశాం. మంచిదేనా?
-కె. అర్జున్, కొంపల్లి
పడమర ఇంటికే సెల్లారు తీసుకునే వీలు ఉంటుంది. కానీ మీరు పంపిన నక్షలో ఇంటిని నైరుతి భాగంలో కట్టి దానికింద సెల్లారు తీశారు. మొత్తం స్థలంలో ఇల్లు మంచి స్థానంలోనే కట్టారు. కానీ ఎప్పుడైతే సెల్లారుకు వెళ్తారో.. తప్పకుండా తూర్పు అంచువరకు, ఉత్తరం అంచువరకు సెల్లారు తీయాలి. అప్పుడే ఆ సెల్లారు గృహం శోభిస్తుంది. అలానే మీరు సెల్లారులోకి ఈశాన్యం నుంచి దక్షిణం రాంపులో ఎంట్రీని పెట్టారు. అది మంచిది కాదు. పడమర రోడ్డు నుంచి ఒక ఎంట్రీ నేరుగా సెల్లారులో తూర్పు ముఖంగా వెళ్లాలి. మరో ఎంట్రీ ఉత్తరం ఖాళీలో వెళ్లేలా పడమర వాయవ్యంలో గేటు పెట్టాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
వాస్తు l మాది ఇటుకల వ్యాపారం. ఊరికి దూరంగా ఉంటాం. ఇల్లు, బట్టీ వాస్తు ప్రకారం ఎలా నిర్మించుకోవాలి?
వాస్తు… కొత్తగా కట్టిన ఇంటిగోడలకు పగుళ్లు వచ్చాయి. వాస్తు దోషం అంటున్నారు. నిజమేనా?
వాస్తు | ఇంటిముందు వరండాకు కానీ గుండ్రటి పిల్లర్లు వేయవచ్చా? దీనివల్ల ఏమైనా దోషం ఉంటుందా?
వాస్తు : ఒక ఇంటికి వాయవ్యాలు రెండు ఉంటాయా? అప్పుడు టాయిలెట్లు ఎటు కట్టాలి?