Russia : రష్యాకు చెందిన మిలిటరీ విమానం కూలిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం రష్యాలోని అముర్ ప్రాంతంలోని క్రాస్నోయారోవో అనే ప్రాంతంలో జరిగినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 29, మంగళవారం టీయూ95 ఎంఎస్ బాంబర్ అనే యుద్ధ విమానం కూలిపోయిందని రష్యా తెలిపింది.
ఇది శిక్షణ విమానం. ఘటన జరిగిన సమయంలో విమానంలో ఏడుగురు ఉన్నారు. విమానం బయల్దేరిన కొద్దిసేపటికే నిర్మానుష్య ప్రాంతంలో కుప్పకూలిపోయింది. దీంతో విమానంలోని ఆరుగురు మరణించగా.. ఒకరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన ఒక్కరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
A Russian Tu-95MS bomber crashed minutes after takeoff near the village of Krasnoyarovo. Seven people were on board. Six have died, two of them on the way to hospital. The aircraft’s fuel tanks exploded after impact and the wreckage caught fire.
— Open Source Intel (@Osint613) September 29, 2026
మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమానం కూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని రష్యా అధికారులు వెల్లడించారు.