Asian Games : ఆసియా క్రీడల్లో భారత బృందం హాఫ్ సెంచరీ కొట్టింది. షూటర్లు, అథ్లెట్లు విజృంభించి పతకాలు కొల్లగొట్టగా పదోరోజుకు పతకాల సంఖ్య యాభై దాటింది. మంగళవారం షూటర్ నీరూ ధండా (Neeru Dhanda) ట్రాక్ విభాగంలో స్వర్ణం అందించగా.. అథ్లెటిక్స్‌లో మహిళల రీలే టీమ్ చిరస్మరణీయ పసిడితో గర్జించింది. వీరి స్ఫూర్తితో పురుషుల రీలే జట్టు కూడా కాంస్యం గెలుపొందగా భారత్ ఖాతాలో 52వ పతకం చేరింది.
ఐచీ నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో వంద పతకాలు లక్ష్యంగా సాగుతున్న భారత్ హాఫ్ సెంచరీ కొట్టింది. వరసగా వెండి, కాంస్యాలకే పరిమితమైన మన అథ్లెట్లు మంగళవారం పసిడితో మెరిశారు. మహిళల 4×400మీ టీమ్ ఫైనల్లో పసిడి విద్య రామరాజ్, కిరణ్ పహల్ , ప్రాచీ, పూవమ్మల బృందం అగ్రస్థానంలో నిలిచింది. అంతకుముందు మహిళల హై జంప్‌లో పూజ, పురుషుల 5వేల మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్ కాంస్యంతో మెరిశారు.
FIRST ATHLETICS GOLD IS HERE!!!!! 🤩🇮🇳
Indian 4x400m Women’s Team won the Gold Medal at Asian Games 2026! 🥇
FINALLY, OUR GIRLS DID IT!!!!!!! 🥹 pic.twitter.com/cQqF2VCdHZ
— The Khel India (@TheKhelIndia) September 29, 2026
విద్య రామరాజ్ నేతృత్వంలోని మహిళల 4×400మీ టీమ్ స్వర్ణ కాంతులు వెదలజల్లిన కాసేపటికే పురుషుల రీలే టీమ్ కూడా 4×400మీ విభాగంలో కంచు మోత మోగించింది. ధరమ్వీర్ చౌదరీ, మను థీక్కినిల్, జై కుమార్, విశాల్ థీన్నరసులతో కూడిన చతుష్టయం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 3:00.32తో లక్ష్యాన్ని పూర్తి చేసింది. దాంతో.. భారత్ ఖాతాలో 52వ పతకం చేరింది. మారథాన్ రన్నర్ గుల్వీర్ హ్యాట్రిక్ మెడల్స్(1500మీ, 10000మీ, 5000మీ) సాధించగా.. ప్రస్తుతం ఇండియా ఆరు స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్యాలు గెలుపొందింది.