వాస్తు l మాది ఇటుకల వ్యాపారం. ఊరికి దూరంగా ఉంటాం. ఇల్లు, బట్టీ వాస్తు ప్రకారం ఎలా నిర్మించుకోవాలి?

ఎం. యాదిరెడ్డి, జీడికల్
ఇటుకల వ్యాపారులు ఊరికి దూరంగానే ఉంటారు. మీరు ఇటుకలు తయారుచేసే స్థలం వైశాల్యాన్ని బట్టి.. దక్షిణ పడమర, నైరుతి భాగంలో ఇంటిని ప్రహరీతో నిర్మించండి. మొత్తం స్థలంలో ఆగ్నేయ భాగం లేదా ఉత్తర వాయవ్య భాగంలో బట్టీలు పెట్టి కాల్చుకోవాలి. మట్టిని కలపడానికి ఈశాన్యంలో ఒక గొయ్యి తీసి అందులో ఇటుకల తయారీకి వాడే మట్టిని నానబెట్టుకోవాలి. కేవలం ఎర్ర ఇటుకలే కాకుండా ఇప్పుడు ఎన్నో రకాల ఇటుకలు వస్తున్నాయి. హాలో బ్రిక్స్, సాలిడ్ బ్రిక్స్ లాంటివాటి తయారీకి యంత్రాలు అవసరం అవుతాయి. అలాంటి వ్యవస్థకు దక్షిణం, ఆగ్నేయం, పశ్చిమం, వాయవ్య ప్రదేశాలు ఉపయోగించాలి. పచ్చి ఇటుకలు ఆరడానికి తూర్పు, ఉత్తర దిశలు వాడుకోవాలి.
పల్లెటూరి నమూనాలో విల్లా కట్టు కోవాలని అనుకుంటున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కె. శ్రీనివాస రావు, హైదరాబాద్
ఈమధ్య చాలామంది కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆకర్షణ, ఆడంబరాలే ఇంటి వ్యవస్థకు మూలం కాకూడదు. శాస్త్ర ఉనికి కోల్పోవద్దు. పెద్ద ఇల్లు అయినా, సాధారణ గృహమైనా ఉండబుద్ధి కాని భవనం ఎందుకు? ఆనందం పంచే కుటీరాన్ని కాదనుకోవడం ఎందుకు? ఆలోచించండి. ఎలాంటి నమూనా అయినా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకోవాల్సిందే. పల్లె నమూనా ఇండ్ల విషయంలో ప్రధానంగా పాటించాల్సింది.. లే అవుట్, రోడ్ల సరళి. అడ్డదిడ్డంగా ఇండ్లు కట్టి అది పల్లెటూరు శైలి అంటే నిప్పులో కాలేసినట్లే. తద్వారా ఇండ్లకు వీధిపోట్లు వస్తాయి. ఏ ఒక్కరూ ఆనందంగా ఉండలేరు. శాస్త్ర ప్రకారంగా వీధులు నిర్మించి, దిశలను బంధించి మాత్రమే హంగులు, ఆర్భాటాలకు పోవాలి. ఇష్టం వచ్చినట్లుగా కడితే ఇండ్లు రాణించవు. యోగించవు.
సినిమా హాలుకు కూడా వాస్తు పాటించాల్సిన అవసరం ఉంటుందా?

జి. శశికళాదేవి, కేపీహెచ్‌బీ
సినిమా థియేటర్లను కూడా శాస్త్రబద్ధంగా కట్టుకోవాల్సిందే. వినోద ప్రధానమైనవి అయినా యజమానికి ఆదాయ వనరులే కదా! థియేటర్లలో ముఖ్యమైంది సీట్ల అమరిక. తెర తూర్పు దిశకు పెట్టి ప్రేక్షకులు తూర్పు ముఖంగా కూర్చునేలా సీటింగ్ ఉండాలి. మనుషుల శరీర నిర్మాణంలోని కణాలు తూర్పు వైపు, ఉత్తరం వైపు వాలును ఎక్కువగా ఇష్టపడతాయి. అది ప్రకృతి
పరంగా ఏర్పడే సహజసిద్ధ అంతర్లీన అనుభూతి. కాబట్టి క్యాబిన్స్, ప్రొజెక్టర్ గది దక్షిణం లేదా పడమర దిశల్లో ఎత్తుమీద చేసుకుని శాస్త్రపరమైన జాగ్రత్తలతో నిర్మించినట్లయితే అవి ప్రజలను ఆకర్షిస్తాయి. నిర్మాణాలు ఏవైనా శాస్త్రబద్ధంగా ఉండాల్సిందే
నైరుతిలో మెట్నకు చేస్తే జాగ మిగులుతుంది. దానిని ఎలా వాడుకోవాలి? ప్రహరీ ఎలా ఉంటే మంచిది?

బి. సింధు, కొండమడుగు
ఏ స్థలమైనా నిర్మాణానికి ఉపయోగించే ముందు సూత్రీకరణ చేయాలి. అప్పుడే అది తన శక్తిని అందించడానికి యోగ్యత పొందుతుంది. కేవలం ఇంటిని మాత్రం మెట్నకు కట్టి, ప్రహరీలను గాలికి వదిలేస్తాం. స్థలం పెరిగి ఉన్నా దానిని అలానే వాడుకుంటాం అనుకోవద్దు. పెరిగిన స్థలం ఎన్నటికీ మనకు పనికిరాదు. అది పక్కింటి వారికి ఉపయోగం అవుతుంది. ఉచితంగా ఇచ్చినా మీకు శుభమే. అంతేకానీ, దానిని ఎలాగైనా మన దాంట్లో కలిపేసి ప్రహరీ కట్టాలనుకోవడం మంచిది కాదు. ఎవరికీ పనికిరానిదిగా ఉండిపోతే చెట్లు పెంచుకోండి. అంతేకానీ, దానిలోకి గేట్లు పెట్టి వాడుకుందామన్న
ఆలోచన వద్దు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక, ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం. రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
–సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- vastu
- vastu shastra
- Vastu tips
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

