e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News Most Expensive Fish : ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన చేప ఇది.. దీని ధ‌రెంతో తెలుసా?

Most Expensive Fish : ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన చేప ఇది.. దీని ధ‌రెంతో తెలుసా?

చేప‌లంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి. చేప‌ల కూర అంటే చాలు లొట్ట‌లేసుకుంటూ తినేస్తాం. ముఖ్యంగా సముద్ర‌పు చేప‌ల రుచే వేరు. ఉప్పు చేప చాలా టేస్ట్‌గా ఉంటుంది. కొన్ని చేప‌లు తిన‌డానికి టేస్ట్‌గా ఉంటాయి అలాగే వాటిని కొనాలంటే వేల‌కు వేలు వెచ్చించాలి. చాలా అరుదైన చేప‌లను తినాలంటే వేలు ఖ‌ర్చు పెట్టాల్సిందే.

అయితే.. ఎన్ని చేప‌లు తిన్నా కూడా మ‌నం జ‌న్మ‌లో ఈ చేప‌ను మాత్రం తిన‌లేము. ఎందుకంటే ఇది ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన చేప‌. దీని పేరు బ్లూఫిన్ టూనా(Bluefin tuna). అస‌లు ఈ చేప దొర‌క‌నే దొర‌క‌దు. ఈ చేప‌ను చూస్తే చాలు అని అనుకునేవాళ్లు కోకొల్ల‌లు. ఈ జాతి చేప‌లు అంత‌రించి పోతున్నాయ‌ట‌. అందుకే దీనికి అంత డిమాండ్.

- Advertisement -

2019లో జ‌పాన్‌లోని టోక్యోలో 278 కిలోల బరువు ఉన్న బ్లూఫిన్ టూనా ఫిష్‌ను ప‌ట్టుకున్నారు. దాన్ని వేలంలో 2.5 మిలియ‌న్ పౌండ్ల‌కు అమ్మేశారు. అంటే మ‌న క‌రెన్సీలో 25 కోట్ల‌కు పైనే ఉంటుంది. తాజాగా ఈ చేప యూకేలో క‌నిపించింది. యూకేలోని కార్న్‌వాల్‌లో దీన్ని చూసిన ఓ వాలంటీర్ దాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

జ‌పాన్‌లో ఈ చేప‌ను ప‌ట్టుకోవ‌డం లీగ‌లే కానీ.. యూకేలో ఈ చేప‌ను వేటాడ‌టం, దాన్ని వేలంలో వేయ‌డం నిషేధం. ఒక‌వేళ స‌ముద్రంలో చేప‌లు ప‌డుతుండ‌గా ఆ చేప దొరికినా కూడా దాన్ని స‌ముద్రంలో వ‌దిలేయాలి. ఇదివ‌ర‌కు ఒక‌సారి ఈ చేప‌ బ్రిటీష్ ఐలాండ్‌లో ఉన్న ఐర్లాండ్ సౌత్ కోస్ట్‌లో దొర‌కింది. 270 కిలోల బ‌రువున్న ఆ చేప‌ను ఓ మ‌త్స్య‌కారుడు ప‌ట్టుకున్న‌ప్ప‌టికీ.. దాన్ని తిరిగి స‌ముద్రంలోకి వ‌దిలేశాడు. ఈ జాతి చేప‌లు అంత‌రించి పోతుండ‌టంతో వాటిని కాపాడ‌టం కోసం వాటి వేట‌ను యూకేలో నిషేధించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Squid Game : స్క్విడ్ గేమ్ వీఐపీ యాక్ట‌ర్ గెయోఫ్రే గుర్తున్నాడా? ఆయ‌కు ఇండియాతో క‌నెక్ష‌న్ ఉంద‌ట‌

Alligator Attacks Man : ఈత కొడుతున్న వ్య‌క్తిపై మొస‌లి దాడి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలుసా?

Sandwich: బుల్లెట్ బండి మీద శాండ్‌విచ్‌ అమ్ముతున్నాడు.. వీడియో వైర‌ల్‌

Spider inside Woman’s Ear : మ‌హిళ చెవిలో దూరిన సాలీడు..

70 ఏళ్ల వ‌య‌సులో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన వృద్ధురాలు..

Viral Video : ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయ‌డానికి క్రేన్‌నే తీసుకొచ్చారు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement