నిన్నటి నుంచి క్వీన్ ఎలిజబెత్‌కు చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో రంగు మారిన తన చేతులు కనిపిస్తాయి. సాధారణంగా చేతులు తెల్లగా కనిపిస్తాయి. కానీ.. క్వీన్ ఎలిజబెత్ చేతులు మాత్రం ఊదా(purple) రంగులోకి మారడంతో తన అభిమానులు, నెటిజన్లు ఆందోళన చెందారు. ఇప్పటికే తనకు ఆరోగ్యం బాగాలేదు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన చేతులు రంగు మారి కనిపించడంతో మరింత ఆందోళన చెందారు.
నవంబర్ 19 న లండన్‌లోని విండ్సర్ కాస్టిల్లో డిఫెన్స్ చీఫ్ జనరల్ సర్ నిక్ కార్టర్‌తో క్వీన్ ఎలిజబెత్ భేటీ అయ్యారు. ఆ సమయంలో తీసిన ఫోటోనే ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఆ ఫోటోను బకింగ్హమ్ ప్యాలెస్ విడుదల చేసింది.
ఇప్పటికే వెన్ను నొప్పి కారణంగా మరో నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని క్వీన్‌కు డాక్టర్లు సూచించడంతో.. చేతులు రంగు మారి కనిపించడంతో ఇంకా తనకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయా అని అంతా అనుకున్నారు.
అయితే.. ఆ ఫోటోపై షేక్స్పియర్ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ జై వర్మ స్పందించారు. అది రెనాడ్స్ అనే వ్యాధి వల్ల అయి ఉండొచ్చు లేదంటే చేతులు చల్లగా అవడం వల్ల అయి ఉండొచ్చు. రక్తం డీఆక్సీజనరేటెడ్ అవడం వల్ల కూడా చేతులు అలా ఊదా రంగులోకి మారినట్టు కనిపిస్తాయి.. అని వర్మ స్పష్టం చేశారు.
జాన్ హోప్కిన్స్ మెడిసిన్ సైట్ ప్రకారం.. కోల్డ్ లేదా స్ట్రెస్ వల్ల చేతులకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక అలా చేతులు రంగు మారినట్టు కనిపిస్తాయి అని స్పష్టం చేశారు.
నేషనల్ హెల్త్ సర్వీస్, యూకే ప్రకారం.. అది పెద్దగా సీరియస్ కండిషన్ కాదు. చల్లటి వాతావరణం ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. శరీరానికి కాస్త వేడి తాకితే.. ఆ కండిషన్ మారుతుంది.. అని స్పష్టం చేసింది.
నెటిజన్లు కూడా తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తూ క్వీన్ ఎలిజబెత్‌కు ఏమైంది.. అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.
2019 లో కూడా ఒకసారి క్వీన్ ఎలిజబెత్ ఇలాగే ఊదా రంగు కలిగిన చేతులతో కనిపించారు. జోర్డాన్‌లో రాయల్స్‌తో మీటింగ్ జరుగుతున్నప్పుడు క్వీన్ అలా కనిపించారు.
The Queen now has zombie hands… wonder why?#boostershot https://t.co/RRVDj31TSd
— Matthew Scarsbrook (@mgscarsbrook) November 17, 2021
Apparently the queen's hands have turned purple, doctors day it's ok though, apparently some lizards do that when they're feeling threatened.
— Mike the lefty (@MikeTheLefty) November 19, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది సిపాయిలపల్లె.. ఇక్కడి వాళ్ల దృష్టిలో ఉద్యోగం అంటే ఆర్మీ కొలువే..
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
Password : ఇండియన్స్ కామన్‌గా వాడే పాస్వర్డ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Red crabs : కోట్ల సంఖ్యలో రోడ్ల మీదికొచ్చిన పీతలు.. స్థంభించిన జనజీవనం.. ఎక్కడో తెలుసా?
బిచ్చగాడి అంతిమయాత్రకు భారీగా జనం.. కారణం ఏంటి?