ఇది సిపాయిలపల్లె.. ఇక్కడి వాళ్ల దృష్టిలో ఉద్యోగం అంటే ఆర్మీ కొలువే..
Army jobs | గతంలో ఆ గ్రామానికి సాయుధ పోరాట చరిత్ర ఉంది. వర్తమానంలో సైనికుల పల్లెగా మరో గుర్తింపునూ పొందింది. ఆ ఊరిలో ఒకరిద్దరు కాదు.. 30 మందికి పైగా సైనిక ఉద్యోగులున్నారు. ఇక్కడి పిల్లలు మూతిమీద మీసం మొలవకముందే సైనికులు కావాలని కలలుగంటారు. వీళ్ల దృష్టిలో ఉద్యోగం అంటే ఆర్మీ కొలువే. ఇలా, దేశ రక్షణలో జీవితాలను సార్థకం చేసుకుంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొందుగుల గ్రామ యువకులు.

బొందుగులకు చెందిన చాలా మంది దేశ రక్షణలో పనిచేస్తున్నారు. రక్షణ దళాల్లో ఉద్యోగమంటే మృత్యువుతో పోరాటమని తెలిసినా తమ పిల్లలను అటువైపుగా ప్రోత్సహిస్తారు తల్లిదండ్రులు. ఏకైక వారసుడున్న కుటుంబాలు సైతం పిల్లలను సైనికుడిగా చూడాలని తపిస్తాయి. ఈ గ్రామం నుంచి ఏటా ఎంతో కొంతమంది సైన్యంలో చేరడం ఆనవాయితీ. దీంతో బొందుగుల ‘సిపాయిల పల్లె’గా ప్రఖ్యాతి గాంచింది. చాలా ఏండ్ల క్రితం.. గ్రామానికి చెందిన గడ్డమీది మల్లేశ్ ఆర్మీలో చేరడంతో బొందుగుల ఆర్మీ ఉద్యోగాల బాట పట్టింది. తను ముప్పై ఏండ్ల క్రితం ఆర్మీలో చేరాడు. స్వగ్రామానికి వచ్చినపుడు సరిహద్దు అనుభవాలను స్థానికులతో పంచుకొనేవాడు. ఆర్మీ కొలువు పట్ల ఆసక్తి కలిగించేవాడు. పది, ఇంటర్ పాసైన వారు కూడా ఆర్మీ ఉద్యోగాలను సాధించడంలో విజయం సాధించడంతో ఒకరిని చూసి ఒకరు ప్రేరణ పొందుతున్నారు. ప్రస్తుతం 30 మందికి పైగా ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.
కుటుంబాలకు దూరంగా..
సైన్యంలో కొలువంటేనే ఎన్నో త్యాగాలు. కుటుంబానికి దూరంగా ఉండాలి. మృత్యువుకు అతి దగ్గరగా.. సరిహద్దుల వెంట విధులు నిర్వర్తించాలి. శుభకార్యాలు, ఇతరత్రా కార్య క్రమాలకు హాజరుకాలేని పరిస్థితులూ ఏర్పడతాయి. అయినా సరే, త్యాగాలకు సిద్ధపడుతూ బొందుగులలోని అనేక కుటుంబాలు తమ పిల్లలను సైన్యంలోకి పంపుతున్నారు. ఆ దంపతుల పేరు అంబాల రమేశ్, లక్ష్మి. ఏడేండ్ల క్రితం ఒక్కగానొక్క కొడుకు శివకుమార్‌ను ఆర్మీకి పంపారు. రమేశ్ కూడా యువకుడిగా ఉన్నప్పుడు ఆర్మీ ఉద్యోగానికి ప్రయత్నించాడు. కానీ, ఫిట్నెస్ టెస్ట్‌లో ఎంపిక కాలేకపోయాడు. ఆ కలను తన కొడుకు ద్వారా నిజం చేసుకొన్నాడు. ఆరు నెలలకోసారి ఇంటికొచ్చే కొడుకుతోనే తమ ఇంటికి పండగ సంబురం వస్తుందని, కొడుకు లేని ఏ పండగ కూడా తమకు పండగలా అనిపించదనీ తల్లి లక్ష్మి చెమర్చిన కండ్లతో చెబుతుంది. ‘నా కొడుకు ఆర్మీలో చేరతానంటే, ధైర్యంగా పంపాను. ఇరవై మూడేండ్లుగా సైన్యంలో చేస్తున్నాడు.
ఒక్కగానొక్క బిడ్డ మాకు దూరంగా ఉండటం బాధ కలిగించే విషయమే అయినా.. దేశ రక్షణకు పాటుపడుతున్నాడన్న సంతృప్తితో ఆ బాధను మర్చిపోతున్నాం’ అంటున్నది మరో సైనికుడి మాతృమూర్తి గుండగోని వెంకటమ్మ. సెలవులకు సొంతూరికి రావడమంటే.. ఆ వీర సైనికులకు మహా ఇష్టం. ‘ఆర్మీలో చేరాలన్నది నా చిన్నప్పటి కల. ఆ ఆసక్తితోనే ఏడాది క్రితం చేరాను. విధి నిర్వహణలో అనునిత్యం సవాళ్లే ఉంటాయి. ఆ ఒత్తిడిలోనే ఆనందాన్ని అనుభవిస్తాం’ అంటాడు ఈమధ్యే సెలవులపై వచ్చిన అనిల్. చేతిలో సూట్‌కేస్‌తో, భుజానికి పెద్దపెద్ద బ్యాగులతో మిలిట్రీ కటింగ్‌లో హుందాగా ఊళ్లో కాలుపెట్టే ప్రతి సైనికుడూ.. ఆ ఊరి యువతకు ఓ స్ఫూర్తి పాఠమే.
– గంజి ప్రదీప్ కుమార్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ ఊళ్లో అందరూ రైతులే.. మన తెలంగాణలోనే ఉన్న ఈ గ్రామం గురించి తెలుసా?
ఒకప్పుడు భిక్షాటన ఆ ఊళ్లో కులవృత్తి.. కానీ ఆ ఒక్క నిర్ణయంతో..
వ్యవసాయం చేస్తున్న డాక్టర్.. గవర్నర్ ఇంటికి కూడా ఈయన పండించిన బియ్యమే వెళ్తాయి
చీమలు, చెద పురుగులతో ఐస్‌క్రీమ్‌లు, పచ్చళ్లు.. మరెన్నో వెరైటీలు.. తింటే ఎన్నో లాభాలు !!
116 ఏండ్లు గడిచినా చెక్కుచెదరని గడీ.. ఓ రైతు కట్టుకున్న ఇంద్ర భవనం ఎక్కడుందో తెలుసా?
Mystery | ఈ ఊళ్లో ఒకరు పోతే.. వారంలో ఇంకొకరు చావాల్సిందే.. వందల ఏళ్లుగా ఇదే సీన్
కరీంనగర్‌లోని ఈ గుట్టల వల్లే తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చిందా?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

