e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News చీమ‌లు, చెద పురుగులతో ఐస్‌క్రీమ్‌లు, ప‌చ్చ‌ళ్లు.. మ‌రెన్నో వెరైటీలు.. తింటే ఎన్నో లాభాలు !!

చీమ‌లు, చెద పురుగులతో ఐస్‌క్రీమ్‌లు, ప‌చ్చ‌ళ్లు.. మ‌రెన్నో వెరైటీలు.. తింటే ఎన్నో లాభాలు !!

Variety Food | పండించేవాళ్లు తక్కువ అవుతున్నారు. తినేవారి సంఖ్య పెరుగుతున్నది. వెరసి, ఆహారపు కొరత మనల్ని వెంటాడనున్నది. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? తక్షణ సమాధానం.. కీటకాలే. కొందరు పాక నిపుణులు మన పూర్వీకులు ఆస్వాదించిన క్రిమి భోజనాన్ని వెలుగులోకి తెస్తున్నారు. కీటకాలతో కూరలు వండటం ఎలా? పచ్చళ్లు పెట్టుకోవడం ఎలా? అంటూ కొత్త ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు.

నాలుగైదు దశాబ్దాల క్రితం.. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగినవారు కచ్చితంగా ఉసిళ్ల వేపుడు తినే ఉంటారు. నేటికీ ఏజెన్సీ జిల్లాల్లోని కోయ, గోండు, కొండరెడ్లు, సుగాలి, కోలం, నాయక్‌పోడ్‌, అంధ్‌ వంటి గిరిజన-ఆదివాసీ తెగలు చీమల్ని ఆహారంగా తింటాయి. జార్ఖండ్‌లోని కోడా ఆదివాసీలైతే ఆరేడు తరాలనుంచీ బెమౌట్‌ చీమలను ఆనందంగా ఆరగిస్తున్నారు. నిజానికి, చీమలు ఎంతో బల వర్ధకమైన ఆహారమని అంటున్నారు బెంగళూరుకు చెందిన తన్షా వోహ్రా. కీటకాల వంటకంపై తన బృందంతో కలిసి అధ్యయనం జరుపుతున్నారు తన్హా.

రెండు వేలకుపైగా..

- Advertisement -

కీటకాలను తినే అలవాటు తరాల నుంచీ ఉంది. ప్రజల్లో ఆధునికత పెరిగేకొద్దీ కొన్నికొన్ని ఆహారాలు, అలవాట్లు దూరం అవుతున్నాయి. తేనెటీగలు, కందిరీగలు, చీమలు, మిడతలు, ఉప్పు మిడతలు, తూనీగలు, చెద పురుగులు వంటివాటిని ఒకప్పుడు లొట్టలేసుకొని తినేవారట. మన పూర్వీకుల మెనూలో రెండు వేలకుపైగా కీటకాలుండేవి. ప్రస్తుతం, ఆ సంఖ్య ఐదొందలకు పడిపోయింది. ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఖర్జూర పురుగుల లార్వా నుంచి అద్భుతమైన వంటకాన్ని చేస్తారు. అస్సాంలో ఎర్రచీమల లార్వాతోనూ పచ్చళ్లు పెడతారు. మన దేశంలో దాదాపు 10 రాష్ర్టాలలో 300 పైచిలుకు కీటకాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. వారిలో ఎక్కువమంది గిరిజన బిడ్డలే.

Variety food

ఇవీ ప్రయోజనాలు

చీమలు, ఇతర తినగలిగే కీటకాల వంటల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు నిపుణులు. బస్తర్‌ ఆదివాసీలు వండుకొనే చీమల చట్నీలో, ఈత పురుగుల కూరలో పోషక విలువలు అపారం. వర్షాకాలంలో వచ్చే రోగాలను తట్టుకోవడానికి ఈ బలవర్ధక ఆహారం ఉపయోగపడుతుంది. ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీలు ఆరగించే ‘చాప్‌ డా’ అనే చీమల చట్నీ రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. దీన్ని కార్పొరేట్‌ కంపెనీలు మార్కెట్‌లో అమ్ముతూ లాభాలు ఆర్జిస్తున్నాయి. చీమల పచ్చడి జ్వరం, జలుబు లాంటి అస్వస్థతలకు చక్కని మందులానూ పనిచేస్తుంది. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫార్మిక్‌ యాసిడ్‌, ప్రొటీన్లు, క్యాల్షియం ఉండటం వల్ల మలేరియా, కామెర్ల
చికిత్సలో దీన్ని జోడిస్తారు. అయితే ‘మిగతా కీటకాలతో పాటు చీమలలోనూ మానవ శరీరానికి హాని కలిగించే పదార్థం ఏదైనా ఉందా? అనే కోణంలోనూ పరిశోధన చేయాల్సి అవసరం ఉంది’ అంటున్నారు తన్షా వోహ్రా. ఆ వైపుగానూ అధ్యయనానికి ఆమె సిద్ధం అవుతున్నారు. త్వరలోనే, ఇంకో సంచలన వార్త వింటామన్న మాట!

Variety food

కీటకాలను తినండి : ఐరాస

అధిక ప్రొటీన్‌ కలిగిలి కీటకాలను ఐక్య రాజ్య సమితి కూడా సిఫారసు చేస్తున్నది. ఈ నిర్ణయానికి కారణం ముంచుకొస్తున్న ఆహార కొరతే. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ నివేదిక ప్రకారం.. మనం నిరుపయోగంగా భావించే కీటకాలే ఆహార సంక్షోభం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించబోతున్నాయి. 2023 చివరి నాటికి తినదగిన కీటకాల ప్రపంచ మార్కెట్‌ 2 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుందని అంచనా. కీటకాలతో రకరకాల వంటకాలను వండి వడ్డిస్తున్నారు చేయి తిరిగిన షెఫ్‌లు. మావెరిక్‌ అనే వంట నిపుణుడు అయితే, బతికున్న చీమలతో రుచికరమైన ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తాడు. అమెరికాలో ఉప్పు మిడతల ప్రొటీన్‌ బార్‌లు చాలా పాపులర్‌. బొద్దింకల పాలతో చేసిన ఆహారాలు కూడా కొన్ని దేశాల్లో ప్రత్యేకం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

స‌హ‌జంగా బ‌రువు త‌గ్గేందుకు ఈ పండ్లు తినండి..!

ఈ ఆహార పదార్ధాలను కలిపి తినకూడదా..?

చ‌ద్ద‌న్నాన్ని ఛీ కొడుతున్నారా.. అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!

Healthy Food | ఈ పండ్లు తింటే అన్ని లాభాలా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement