మండే ఎండల వల్ల శరీరంలో నీటిశాతం తగ్గడంతో తీవ్రమైన వడదెబ్బకు గురవుతుంటారు. అందుకే ఈ సమయంలో హైడ్రేషన్ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. అయితే దాహం వేసినప్పుడు దొరికిన పానీయం తాగడం కంటే, ఏది మన శరీరానికి మేలు చేస్తుందో తెలుసుకొని తాగడం చాలా ముఖ్యం. హైడ్రేషన్ అంటే కేవలం నీరు తాగడం మాత్రమే కాదు. శరీర అవసరాలకు తగ్గట్టుగా ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకోవడం. కొన్ని పానీయాలు మనల్ని చల్లబరుస్తాయని మనం అనుకుంటాం. కానీ, అవి శరీరంలో చకెర స్థాయులను పెంచి, మనల్ని మరింత నీరసంగా మారుస్తాయి.
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్: వీటిలో ఫైబర్ తకువగా ఉండి, చకెరలు ఎకువగా ఉంటాయి. ఇవి రక్తంలో చకెర స్థాయుల్ని ఒకసారిగా పెంచి, ఆపై శక్తిని వేగంగా తగ్గించేస్తాయి.
ఐస్డ్ టీ: ఇందులో ఉండే అధిక చకెర.. కెఫిన్ మూత్రవిసర్జనను పెంచి, శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి.
ప్రీ-ప్యాకేజ్డ్ ప్రొటీన్ షేక్స్: వీటిని జీర్ణం చేసుకోవడం శరీరానికి కష్టమవుతుంది. ఆహారానికి సంబంధించిన థర్మిక్ ప్రభావం వల్ల ఇవి శరీరంలో వేడిని సృష్టిస్తాయి. దీనివల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.
శీతల పానీయాలు: ఫ్లేవర్డ్ సోడాల్లో ఉండే విపరీతమైన చకెరలు శరీరానికి మేలు చేయవు. ఈ ప్రభావంతో జీవక్రియలు నెమ్మదిగా సాగుతాయి. ప్రత్యామ్నాయాలు
కొబ్బరి నీరు: సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్లతో నిండిన కొబ్బరి నీరు శరీరానికి కావాల్సిన తేమను అందిస్తుంది. ఇందులో అదనపు చకెర ఉండదు కాబట్టి ఇది సురక్షితం.
కోకుమ్ రసం: ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. భోజనం తర్వాత దీనిని తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
మూలికా నీరు: సాదా నీరు తాగడం బోర్ కొడితే, పుదీనా ఆకులతో పుచ్చకాయ ముకలు, నారింజ, నిమ్మకాయ ైస్లెసులు లేదా సోంపు, తులసి కలిపిన నీటిని తాగవచ్చు. ఇవి శరీరానికి అవసరమైన చల్లదనంతో పాటు ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి.