ఈ రోజుల్లో చాలామందికి బరువు తగ్గడం భారమైంది. వెయిట్‌లాస్ కోసం కొందరు జిమ్‌ల చుట్టూ తిరిగితే, మరికొందరు కఠినమైన డైట్ ఫాలో అవుతున్నారు. అయితే, కొందరు ఉన్నట్టుండి బరువు తగ్గుతారు కూడా. అకస్మాత్తుగా, ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గడం అనేది మొదట్లో సంతోషంగా అనిపించినప్పటికీ.. అది కొన్నిసార్లు అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నది. మీ ఆహారంలో మార్పులు లేకుండా, వ్యాయామం చేయకుండా బరువు తగ్గుతుంటే, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఉన్నట్టుండి బరువు తగ్గడానికి కొన్ని అనారోగ్య పరిస్థితులు కారణం కావచ్చు. అవేంటో తెలుసుకుందాం. శరీరంలో పోషకాలు తగ్గడం, జీవక్రియలో మార్పులు, ఆకలి మందగించడం వల్ల ఇలా జరగవచ్చు.
థైరాయిడ్: థైరాయిడ్ గ్రంథి శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. ఈ గ్రంథి అవసరమైన దానికంటే ఎకువ హార్మోన్లను తయారు చేయడం ప్రారంభించినప్పుడు, దీనిని హైపర్ థైరాయిడిజం అని పిలుస్తారు. దీని వల్ల శరీరం వేగంగా కేలరీల్ని బర్న్ చేస్తుంది. దీని కారణంగా ఓ వ్యక్తి ఎటువంటి ప్రయత్నం లేకుండానే బరువు తగ్గవచ్చు.
డయాబెటిస్: మధుమేహం ఉన్న రోగులలో ముఖ్యంగా రక్తంలో చకెర స్థాయులు ఎకువ కాలం అదుపులో లేనప్పుడు, ఆకస్మికంగా బరువు తగ్గవచ్చు. ఇలాంటి పరిస్థితిలో శరీరం శక్తి కోసం గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఫలితంగా, శరీరం శక్తి కోసం కొవ్వు, కండరాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి కారణమవుతుంది.
జీర్ణక్రియ సమస్యలు: తిన్న ఆహారం ఒంట బట్టకపోవడం, పేగులకు సంబంధించిన వ్యాధుల వల్ల కూడా ఉన్నట్టుండి బరువు తగ్గే అవకాశం ఉంది.
మానసిక ఒత్తిడి: అధిక ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వల్ల ఆకలి తగ్గిపోతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు కూడా ఉన్నట్టుండి బరువు
కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, కాలేయ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ పరిస్థితిని అనుభవించవచ్చు.
అయితే, బరువు తగ్గడంతో పాటు విపరీతమైన నీరసం, బలహీనత, కడుపునొప్పి, అజీర్తి, జ్వరం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోడం ఉత్తమం.