హృదయం మాట వినండి!
చాలా గుండెజబ్బులు తీవ్రమైన ఛాతీ నొప్పితోనే మొదలవ్వవు. చిన్నచిన్న మార్పులతోనే సమస్య అధికం అవుతుంది. అయితే, ఆ లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. గోటితో పోయే దానికి గుండెపోటు దాకా తెచ్చుకుంటారు. అందుకే, మీ హృదయం చెప్పే మాట వినాలని వైద్య నిపుణులు అంటున్నారు.
చాలా గుండెజబ్బులు తీవ్రమైన ఛాతీ నొప్పితోనే మొదలవ్వవు. చిన్నచిన్న మార్పులతోనే సమస్య అధికం అవుతుంది. అయితే, ఆ లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. గోటితో పోయే దానికి గుండెపోటు దాకా తెచ్చుకుంటారు. అందుకే, మీ హృదయం చెప్పే మాట వినాలని వైద్య నిపుణులు అంటున్నారు.
మెట్లు ఎక్కుతున్నప్పుడు, మామూలుగా నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆయాసం వస్తే.. దానిని నిర్లక్ష్యం చేయవద్దు. మీ శరీర అవసరాలకు అనుగుణంగా మీ గుండె స్పందించడంలో ఇబ్బంది పడుతున్నది అనడానికి.. ఆయాసం తొలి సంకేతం!
రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత ప్రతిఒక్కరూ అలసిపోతారు. కానీ, గుండె సంబంధిత అలసట భిన్నంగా ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ, రాత్రంతా మంచినిద్ర పోయినప్పటికీ.. తెల్లారి కూడా మీ శక్తి అంతా హరించుకుపోయినట్లుగా అనిపిస్తే.. గుండెపై భారం పడుతున్నదని అర్థం చేసుకోవాలి. గతంలో సులభంగా చేసిన పనులు కూడా ఇప్పుడు కష్టంగా అనిపిస్తే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.
బూట్లు అకస్మాత్తుగా బిగుతుగా మారుతున్నాయా? కాళ్లపై సాక్సుల గుర్తులు మామూలు కన్నా లోతుగా కనిపిస్తున్నాయా? అంటే, మీ శరీరంలో ద్రవం ఎక్కువగా పేరుకుపోతున్నట్లే! చీలమండలు, కాళ్లు, పొత్తికడుపులో ద్రవం పేరుకుపోవడం మొదలైతే.. గుండె ఒత్తిడికి గురవుతున్నదని గుర్తించాలి.
గుండె దడగా ఉంటున్నదా? ఛాతీలో ఏదో వేగంగా కొట్టుకుంటున్న భావన కలుగుతున్నదా? అప్పుడప్పుడూ అయితే ఫర్వాలేదు. ఒత్తిడి, కెఫిన్, డీహైడ్రేషన్, నిద్రలేమి లాంటివి ఇందుకు కారణం కావచ్చు. కానీ, ఇవే సమస్యలు తరచుగా, ఎక్కువసేపు కొనసాగుతుంటే, తీవ్రంగా అనిపిస్తుంటే.. గుండె పరీక్షలు చేయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించాలి.
అప్పుడప్పుడూ తల తిరిగినట్లు అనిపించడానికి చాలా కారణాలు ఉంటాయి. భోజనం మానేయడం, డీహైడ్రేషన్‌కు గురవడం లాంటి వాటి వల్ల కూడా తల తిరుగుతుంది. అలా కాకుండా, సరిగ్గా నిలబడలేకపోవడం, స్పృహ కోల్పోవడం లాంటివి జరిగితే.. మీ మెదడుకు తగినంత రక్త ప్రసరణ అందడం లేదని అర్థం. మెదడుకు నిరంతరాయంగా రక్త సరఫరా జరగాలి. ఒకవేళ గుండె ఆ సరఫరాను కొనసాగించ లేకపోతే.. తల తిరగవచ్చు. స్పృహ కోల్పోవచ్చు. ఇలా ఒక్కసారి జరిగినా.. వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. గుండె సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. సరైన చికిత్స చేయడానికి, త్వరగా కోలుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

