పాములను పట్టుకోవాలంటే చాలా మంది ప్రొఫెషనల్స్ వచ్చి, పొడవాటి హాండిల్స్ వేసుకొని వచ్చేస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం వట్టి చేతులతోనే పద్నాలుగు అడుగుల పామును పట్టేశాడు. ఈ ఘటన థాయ్‌ల్యాండ్‌లో వెలుగు చూసింది.
క్రాబి ప్రాంతానికి చెందిన సుతీ నేవాడ్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఈ పని చేశాడు. పద్నాలుగు అడుగుల పామును 20 నిమిషాల్లో పట్టుకొని బ్యాగులో పట్టేశాడు. అతను ఈ పనిలో ప్రొఫెషనల్ అని తెలుస్తోంది. వట్టి చేతులతో ఇలా పాములను పట్టుకోవడం అందరి వల్లా కుదరదని, తనకు చాలా అనుభవం ఉందని సుతీ వెల్లడించాడు.
‘ఇలా పాములను వట్టి చేతులతో పట్టుకోవడం చాలా ప్రమాదకరం. ఎవరూ ఇలాంటి పని చేయకూడదు’ అని సుతీ చెప్పాడు. ఈ పాము మెడను చేత్తో పట్టుకొని బ్యాగులో పడేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.