Cable Bridge | గుజరాత్ రాష్ట్రంలో తీగల వంతెన కూలి వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని కొన్ని వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రజలు తీగల వంతెనపై నడవాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు టూరిస్టులు చేసిన పని ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది.
కర్ణాటకలో కొందరు టూరిస్టులు తీగల వంతెనపైకి ఏకంగా కారును ఎక్కించారు. ఉత్తర కన్నడ జిల్లా యెల్లపురాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శివపుర కేబుల్ బ్రిడ్జిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు టూరిస్టులు బ్రిడ్జిపైకి ఏకంగా కారును తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. కారు బరువు కారణంగా వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించి వారిని వెనక్కి పంపించారు.
బ్రిడ్జిపై కారును తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారు వెనుక చాలా మంది టూరిస్టులు కనిపించారు. వాహనాన్ని తోసేటప్పుడు వంతెన ఊగుతూ ప్రమాదకరంగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Locals in #Shivapura demand strict monitoring of vehicle movement on the bridge which is considered as a lifeline of locals @NewIndianXpress @XpressBengaluru @KannadaPrabha @ns_subhash @KiranTNIE1 @Parisara360 @AmruthJoshi2 @DgpKarnataka @aranya_kfd @NammaBengaluroo @DpHegde pic.twitter.com/9n20It18Sy
— Amit Upadhye (@Amitsen_TNIE) November 1, 2022