Harish Rao | భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న రేవంత్ సర్కార్ : హరీష్‌రావు
Harish Rao | తెలంగాణలో విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు.
హైదరాబాద్ : తెలంగాణలో విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాలను( Versities ) రేవంత్ రెడ్డి ( Revanth Reddy) ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ( Harish Rao ) ఆరోపించారు. చదువులకు నిలయమైన యూనివర్సిటీలను లాక్కొని రియల్ దందా ( Realestate ) చేస్తూ, భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని ట్విటర్ ( Twitter ) వేదికలో మండిపడ్డారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల భూములను టార్గెట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు. భావితరాలకు జ్ఞానాన్ని అందించే పరిశోధనా కేంద్రాలని అన్నారు. వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
మొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి బలవంతంగా 100 ఎకరాలకు పైగా భూములను లాక్కున్నారు. 60 ఏళ్లుగా ఎంతో కష్టపడి కాపాడుకుంటూ వస్తున్న ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా కేంద్రం లోని 60 ఎకరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఎంతో విలువైన పరిశోధనా సంపద నేలమట్టమైంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలకు పైగా అటవీ భూమిని తాకట్టుపెట్టి విధ్వంసం చేశారు. దీనివల్ల అక్కడి పర్యావరణ వ్యవస్థ చిన్నాభిన్నం కావడమే కాకుండా, మూగ జీవాల మనుగడకే ముప్పు వాటిల్లిందని వెల్లడించారు. తాజాగా మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన 50 ఎకరాలపై ప్రభుత్వం కన్ను పడిందని , అదే పద్ధతిలో ఇక్కడి భూములను కూడా లాక్కోవాలని చూస్తోందని
ఆరోపించారు.
ఇవి యాధృచ్చికంగా జరిగిన సంఘటనలు కావని, విద్యా వ్యవస్థపై, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిపై జరుగుతున్న ఉద్దేశపూర్వక దాడి అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థులన్నా, పరిశోధనలన్నా, పర్యావరణమన్నా ఎందుకింత చిన్నచూపు అని ప్రశ్నించారు. భవిష్యత్ తరాలకు జ్ఞానాన్ని అందించాల్సిన చోట, ఆవిష్కరణలకు ఊపిరి పోయాల్సిన చోట, భూములను లాక్కోవడం దేనికి సంకేతమని అన్నారు .
విద్యా సంస్థల భూములను కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లలా చూస్తారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.తెలంగాణ భవిష్యత్తును నిర్మించాల్సింది పోయి, ఉన్న విజ్ఞాన కేంద్రాలను బుల్డోజర్లతో కూల్చడం సిగ్గుచేటని హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలను ఆపాలని, యూనివర్సిటీల భూములను వాటికే వదిలేయాలని, లేదంటే విద్యార్థి లోకం, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

