రామగిరి, జనవరి 07 : కెమిస్ట్రీ విద్యవిభ్యసించే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, ఓ వైపు విద్యరంగం.. మరోవైపు ఫార్మారంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో న్యూ విజ్ఞప్ ఆఫ్ మిస్ట్రీస్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సెమినార్‌కు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాదారు. డిగ్రీ స్థాయి నుంచే విద్యార్థులు పరిశోధనలపై పట్టు సాధించాలని, నూతన ఆవిష్కరణల వైపు ఆలోచన చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొ.ఎస్.బి. జొన్నలగడ్డ, డా. సి. సుధాకర్‌రెడ్డి, డాక్టర్ వీరారెడ్డి, డా.ఎన్.రవికుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.కె.శ్రీనివాసారాజు, సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. దోమల రమేష్, డా.ఏ.వసంత, డా.వెంకటకృష్ణ, కె.మంచాల, నిర్వహణ కమిటీ సభ్యులు డా.కె.రవికుమార్, డా.పి.ఆపేంద్ర, సమన్యయ కర్తలు డా.బొజ్జ అనిల్ కుమార్, డా.సాలయ్య, పుష్పలత, ఉమెన్స్ కళాశాల వివిధ విభాగాల అధ్యాపకులు, వివిధ యూనివర్సిటీల ఆధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.

Ramagiri : కెమిస్ట్రీ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ : ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్