Kishore Tirumala | టాలీవుడ్ యాక్టర్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కిశోర్ తిరుమల అండ్ రవితేజ టీం.
ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని షేరే్ చేశాడు కిశోర్ తిరుమల. రవితేజ గారు చాలా రోజుల నుంచి ఇద్దరు మహిళల మధ్య నలిగిపోయే హీరో పాత్రతో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఇదే టాపిక్‌పై రవితేజ ఓ కోర్ ఐడియా చెప్పారు. నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఆ తర్వాత అదే ఐడియాను తీసుకుని స్క్రిప్ట్‌ను డెవలప్ చేశానని చెప్పుకొచ్చాడు కిశోర్ తిరుమల. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఈ మూవీలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, ఖిలాడి ఫేం డింపుల్ హయతి ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇవాళ 10:30 నిమిషాలకు స్వామి వారి కళ్యాణం. అనంతరం ప్రసాద వితరణ జరుగుతుందంటూ.. పంతులు వాయిస్ ఓవర్‌తో సాగే మాటలతో షురూ అయిన గ్లింప్స్.. సినిమా పక్కా ఫ్యామిలీ టచ్‌తో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తుంది.