Viral Video | కోబ్రా లేదా నాగుపాము పేరు వింటేనే చాలు వణుకు పుడుతుంది. కోబ్రా పడగ విప్పిందంటే ఇక అక్కడ మనం ఉండలేం. అన్ని రకాల జాతుల పాములలో నాగుపాములు చాలా విషపూరితమైనవి. అవి ఒక్కసారి కాటేశాయంటే ఇక అంతే.. మృత్యువు వచ్చినట్టే. అందుకే.. నాగుపాములను చూసి చాలామంది భయపడతారు.
ఒక్క నాగుపామును చూస్తేనే దడుసుకుంటాం. మరి ఒకేసారి మూడు నాగుపాములు కనిపిస్తే ఇంకేమన్నా ఉందా.. గుండె ఆగిపోద్ది కదా. ప్రస్తుతం మూడు నాగుపాములకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మూడు నాగుపాములు పడగ విప్పి.. ఒకదాని ముఖం మరొకటి చూసుకుంటున్నాయి. ఒకటేమో బుసలు కొడుతోంది. మూడు నాగుపాములను చూస్తే ట్రయాంగిల్ లవ్‌స్టోరీ గుర్తుకు వస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఎవరు తీశారో.. ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలియదు కానీ.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. అలా ఒకదాని ముఖం ఇంకోటి చూసుకొని ఏం చేస్తాయి. ఈ మూడు పడగ విప్పి.. ఏం చేస్తున్నాయి. ఏమైనా సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నాయా? అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పీటల మీదే పెళ్లి కూతురును లాగి.. ముద్దు పెట్టి పెళ్లికొడుకు రచ్చ: వీడియో వైరల్
Monkeys Kill Dogs | 250 కుక్కలను వేటాడి మరీ చంపేసిన కోతులు.. కారణం ఏంటో తెలుసా?
ప్రాణాలు కాపాడుతున్న ఎయిర్ అంబులెన్స్.. దీన్ని ఎవరు నడుపుతున్నారో తెలుసా?