సోషల్ మీడియాలో ఏ ఫోటో, ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కొన్ని వైరల్ అవుతాయి… ట్రెండ్ అవుతాయి అని అనుకున్న వీడియోలు అస్సలు వైరల్ కావు.. ట్రెండ్ కావు. కానీ.. కొన్నింటిని మనం పట్టించుకోము.. అవే నెటిజన్లను తెగ నచ్చుతాయి. నెటిజన్లకు ఒకసారి ఫోటోలు, వీడియోలు నచ్చాయంటే ఇక మామూలుగా ఉండదు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడమే.
తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏముంది ఆ ఫోటోలో అంటారా.. ఇది ఒక భ్రమ, బ్రాంతిలా ఉండే ఫోటో కానీ.. ఇది నిజమైనదే. ఈ ఫ్రిడ్జ్ అమ్మబడును.. అని ఓ వ్యక్తి ఫ్రిడ్జ్‌కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ ఫోటోను చూసిన నెటిజన్లు.. అక్కడ ఫ్రిడ్జ్ ఎక్కడుంది. అన్నీ కప్‌బోర్డ్స్ ఉన్నాయి కదా అంటూ కామెంట్లు పెట్టసాగారు. కానీ.. జాగ్రత్తగా చూస్తే.. అక్కడ ఫ్రిడ్జ్ కనిపిస్తుంది. ఫ్రిడ్జ్‌కు ఉన్న అద్దం లాంటి డోర్ వల్ల.. దానికి ఎదురుగా ఉన్న వస్తువులు ఫోటోలో కనిపించి.. ఫోటో నెటిజన్లను కన్ఫ్యూజ్ చేసిందన్నమాట. ఇంతకీ మీకు ఆ ఫోటోలో ఫ్రిడ్జ్ కనిపించిందా?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Viral Video: కాఫీ డోర్ డెలివరీ చేయడానికి వెళ్తున్న డ్రోన్‌పై కాకి దాడి
Viral Video : గుడిలో ఏనుగు బీభత్సం.. దాని మీదికి ఎక్కిన వ్యక్తిని కిందపడేసి
Viral Photo : చిల్లర నాణేలతో సాండ్విచ్ ఆర్డర్ ఇచ్చాడు.. ఆర్డర్ వచ్చాక చూసి షాక్
Pic of the Day : దేశీ జూగాడ్.. వాట్ ఆన్ ఐడియా సర్జీ.. వైరల్ ఫోటో