GT vs RCB | మెరిసిన గిల్, అర్షద్.. ఆర్సీబీపై గుజరాత్ ప్రతీకార విజయం..!
GT vs RCB : పంతొమ్మిదో సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఐదో విజయం సాధించింది. ప్రతీకార విజయంతో ఆర్సీబీని టేబుల్ టాపర్ కానివ్వలేదు. ఇంప్యాక్ట్ సబ్ తెవాటియా(27 నాటౌట్ ), హోల్డర్(12)లు పట్టుదలగా ఆడారు. రషీద్ ఖాన్ రాణించగా 6 వికెట్ల తేడాతో గుజరాత్ గెలిచింది.
GT vs RCB : పంతొమ్మిదో సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఐదో విజయం సాధించింది. ప్రతీకార విజయంతో ఆర్సీబీని టేబుల్ టాపర్ కానివ్వలేదు. నరేంద్ర మోడీ స్టేడియంలో బౌలర్ల కృషితో ఆర్సీబీని 155కే కట్టడి చేసిన గుజరాత్ స్వల్ప ఛేదనలో అపసోపాలు పడింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(43) ధనాధన్ ఆడినా.. బట్లర్(39) దంచేసినా వింటేజ్ భువనేశ్వర్(28-3) విజృంభణతో ఆర్సీబీ రేసులోకొచ్చింది. మిడిలార్డర్ విఫలమైనా.. ఇంప్యాక్ట్ సబ్ తెవాటియా(27 నాటౌట్ ), హోల్డర్(12)లు పట్టుదలగా ఆడారు. రషీద్ ఖాన్ రాణించగా 6 వికెట్ల తేడాతో గుజరాత్ గెలిచింది.
ఆర్సీబీని తక్కువకే కట్టడి చేసిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం దక్కినా సద్వినియోగం చేసుకోలేదు. హేజిల్‌వుడ్ ఓవర్లో శుభ్‌మన్ గిల్(43) మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 24 రన్స్ పిండుకున్నాడు. కానీ, ఆ తర్వాతి ఓవర్లోనే సాయి సుదర్శన్(6) వికెట్ తీసి ఈ జోడీని విడదీశాడు భువనేశ్వర్(3-28). మళ్లీ బంతి అందుకున్న భువి.. ఈసారి గిల్‌ను వెనక్కి పంపి మ్యాచ్‌ను రంజుగా మార్చాడు. అయితే.. జోస్ బట్లర్(39) ఎడాపెడా బాదేస్తూ స్కోర్ బోర్డును ఉరికించాడు.
It’s getting intense 🔥
🎥 Bhuvneshwar Kumar delivers what #RCB needed, dismissing both #GT openers 👊
Updates ▶️ https://t.co/I5Hg8ybefh#TATAIPL | #KhelBindaas | #GTvRCB | @RCBTweets pic.twitter.com/ObzCH2LRcI
— IndianPremierLeague (@IPL) April 30, 2026
అయితే.. భువనేశ్వర్ యార్కర్‌ను అంచనా వేయలేక లెగ్ స్టంప్ ఎగిరిపోయింది. అనంతరం.. వాషింగ్టన్ సుందర్(12), షారుక్‌ఖాన్(8) ఇలా వచ్చి అలా వెళ్లగా.. 5 వికెట్లు పడ్డాయి. ఇంప్యాక్ట్ సబ్ రాహుల్ తెవాటియా(27 నాటౌట్ ), హోల్డర్(12)లు గెలుపు బాధ్యత తీసుకున్నారు. ఆరో వికెట్‌కు 30 రన్స్ రాబట్టిన ఈ ద్వయాన్ని సుయావ్ విడదీశాడు.
పడిక్కల్ ఒక్కడే..
సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ బౌలర్లు రెచ్చిపోవడంతో ఆర్సీబీ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడిన బెంగళూరుకు షాకిస్తూ సిరాజ్ తొలి వికెట్ అందించాడు. జాకబ్ బెథెల్(5) కవర్స్‌లో రషీద్ ఖాన్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి బెథెల్ వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ(29), దేవ్‌దత్ పడిక్కల్(40)లు ఇన్నింగ్స్ నిర్మించాలనకున్నారు. కానీ, విరాట్‌ను ఊరిస్తూ రబడ.. రషీద్ రెండో క్యాచ్‌తో గుజరాత్‌ను సంబురాల్లో ముంచెత్తాడు. పవర్ ప్లేలో 59-2తో మంచి స్థితిలో ఉన్నా.. డేంజరస్ రజత్ పాటిదార్(19)ను సూపర్ క్యాచ్‌తో హోల్డర్ వెనక్కి పంపాడు.
A double blow 👊
Rashid Khan & Jason Holder with back-to-back strikes ⚡
Updates ▶️ https://t.co/I5Hg8ybefh#TATAIPL | #KhelBindaas | #GTvRCB | @gujarat_titans pic.twitter.com/3IeQUFwxdb
— IndianPremierLeague (@IPL) April 30, 2026
ఆ తర్వాత బంతి అందుకున్న అతడు జితేశ్ శర్మ(1) వికెట్ సాధించాడు. సిక్సర్‌తో గుబులు రేపిన టిమ్ డేవిడ్(9) రషీద్ ఖాన్ ఓవర్లో హోల్డర్ చేతికి చిక్కగా ఐదో వికెట్ పడింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన కృనాల్ పాండ్యా(4) హోల్డర్‌కు సులువైన క్యాచ్ ఇచ్చాడు. పడిక్కల్‌ను రషీద్ బౌల్డ్ చేయడంతో ఆర్సీబీ కోలుకోలేకపోయింది. ఇంప్యాక్ట్ సబ్ వెంకటేశ్ అయ్యర్(12) సైతం విఫలమవ్వగా రొమారియో షెపర్డ్(17) దంచేసినా19.2 ఓవర్లలో బెంగళూరు155కే ఆలౌటయ్యింది. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు వికెట్లతో రాణించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

