ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో విచిత్రం చోటు చేసుకుంది. అక్కడ కాఫీని డెలివరీ చేయడానికి వెళ్తున్న ఓ డ్రోన్‌పై అక్కడే చెట్టు మీద ఉన్న ఓ కాకి దాడి చేసింది. ఆస్ట్రేలియాలో వస్తువులను డెలివరీ చేసే డ్రోన్లకు ఎప్పుడో పర్మిషన్ ఇచ్చేశారు. ఎలాంటి ట్రాఫిక్ జామ్‌ల గోల లేకుండా.. డ్రోన్ల ఉపయోగించి పలు షాపులు, మాల్స్.. వస్తువులను కస్టమమర్లకు డెలివరీ చేస్తున్నాయి. అక్కడ ఆకాశంలో డ్రోన్లు తిరుగుతూనే ఉంటాయి.
అయితే.. ఆ ఏరియాకు డ్రోన్ కొత్తగా రావడంతో అక్కడే చెట్టు మీద ఉన్న కాకి.. దాన్ని చూసి వెంటనే ఎగురుకుంటూ వెళ్లి దాన్ని వెళ్లకుండా తన నోటితో పట్టి ఆపింది. ఈ ఘర్షణలో కస్టమర్‌కు డెలివరీ చేయాల్సిన ప్రొడక్ట్ కింద పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వింగ్ అనే ప్రోగ్రామ్ ద్వారా.. ఆస్ట్రేలియాలో డ్రోన్స్‌ను ఆపరేట్ చేస్తుంటారు. గూగుల్‌తో టైప్ అయిన వింగ్… అక్కడ డోర్ టు డోర్ డెలివరీ చేస్తోంది. మెడిసిన్స్, కాఫీ, టీ, ఫుడ్, ఇతర సరుకులను డ్రోన్స్ ద్వారా డెలివరీ చేస్తున్నారు. అయితే.. ఇలా డ్రోన్ల మీద పక్షులు దాడి చేయడం ఇదే మొదటిసారి ఏం కాదు. ఇదివరకు కూడా ఇలాగే డ్రోన్స్ మీద పక్షులు దాడి చేశాయట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Viral Video : గుడిలో ఏనుగు బీభత్సం.. దాని మీదికి ఎక్కిన వ్యక్తిని కిందపడేసి
Viral Photo : చిల్లర నాణేలతో సాండ్విచ్ ఆర్డర్ ఇచ్చాడు.. ఆర్డర్ వచ్చాక చూసి షాక్
Pic of the Day : దేశీ జూగాడ్.. వాట్ ఆన్ ఐడియా సర్జీ.. వైరల్ ఫోటో
Ayyayyo Vadhamma: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. అంటున్న హైదరాబాద్ సిటీ పోలీసులు.. ఎందుకని?
Viral Video : ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే.. గాలిలో ప్రాణాలు కలిసిపోయేవి