హైదరాబాద్, ఏప్రిల్ 30 : దీర్ఘకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఇన్స్పెక్టర్లకు డీజీపీ శివధర్ రెడ్డి శుభవార్త చెప్పారు. 35 మంది ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించామని ఆయన వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో గురువారం నాడు పదోన్నతులు పొందిన 35 మంది డీఎస్పీలతో శివధర్ రెడ్డి సమావేశమయ్యారు.
కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యను పరిష్కరించామని శివధర్ రెడ్డి తెలియజేశారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, అడిషనల్ డీజీపీ, పర్సనల్ డీఎస్ చౌహాన్, మల్టీ జోన్ వన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, రైల్వే ఐజీపీ రమేష్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.