Kohli – Ajitesh | అప్పట్లో కోహ్లీతో క్రికెట్.. కట్‌చేస్తే ఐపీఎల్లో అంపైర్..!
Kohli - Ajitesh : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు విరాట్ కోహ్లీ (Virat Kohli)తో కలిసి క్రికెట్ ఆడిన కుర్రాడు ఆర్సీబీ మ్యాచ్‌లో అంపైరింగ్ చేయడం చూసి ఆశ్చర్యపోయారంతా.
Kohli – Ajitesh : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు విరాట్ కోహ్లీ (Virat Kohli)తో కలిసి క్రికెట్ ఆడిన కుర్రాడు ఆర్సీబీ మ్యాచ్‌లో అంపైరింగ్ చేయడం చూసి ఆశ్చర్యపోయారంతా. అరుణ్‌జైట్లీ స్టేడియంలో సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో అజితేశ్ అర్గల్ (Ajitesh Argal) అంపైర్‌గా వ్యవహరించాడు. మ్యాచ్ అనంతరం తన పాత మిత్రుడైన అజితేశ్‌తో కోహ్లీ సరదాగా ముచ్చటించాడు. ఇద్దరూ కలిసి క్రికెట్ ఆడిన రోజులను గుర్తు చేసుకున్నారు.
విరాట్ కోహ్లీ సారథ్యంలో 2008లో అండర్ -19 ప్రపంచకప్ గెలుపొందిన జట్టులో అజితేశ్ అర్గల్ సభ్యుడు. ఆ టోర్నీ తర్వాత విరాట్ సీనియర్ జట్టులోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగాడు. కెప్టెన్సీ చేపట్టి టీమిండియాను నంబర్ 1గా నిలిపాడు.
From match-winner to match official 🏏 #AjiteshArgal, who took 2/7 in India’s 2008 U-19 WC win under #ViratKohli, is now an IPL umpire 👀👏https://t.co/L9BGLblftG
— News18 CricketNext (@cricketnext) April 28, 2026
అజితేశ్ విషయానికొస్తే.. అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుపొందాడు. దాంతో, అతడి కెరీర్ సైతం కోహ్లీ మాదిరిగా గొప్పగా సాగుతుందని ఊహించారంతా. కానీ, అజితేశ్ మాత్రం దారి మార్చుకున్నాడు. క్రికెటర్‌గా కొనసాగకున్నా.. ప్రాణమైన ఆటను వదల్లేక అంపైర్ అవతారమెత్తాడు.
Ajitesh Argal was a key fast bowler in the 2008 U-19 World Cup-winning Indian team captained by Virat Kohli. Argal was named ‘Player of the Match’ in the 2008 final against South Africa. After a short professional career, Argal became an income tax inspector and is now a… pic.twitter.com/JLz4SLesRM
— Boundary & Beyond Co. (@SrijoyMukherjee) April 22, 2026
ఆదాయ పన్ను శాఖలో..
అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా అజితేశ్కు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనిపించింది. కానీ, అతడు చదువుపై శ్రద్ధ పెట్టాడు. ఆదాయపు పన్ను శాఖలో కొన్నాళ్లు ఉద్యోగం చేసిన అజితేశ్.. క్రికెట్‌పై ఇష్టాన్ని చంపుకోలేక అంపైర్ అవ్వాలనుకున్నాడు. అందుకని ఈ ఏడాది అతడు బీసీసీఐ అంపైరింగ్ పరీక్షకు గట్టిగా చదివాడు. పరీక్షలో అదరొట్టి తన కలను నిజం చేసుకున్నాడు.
Two teammates from India’s 2008 U19 World Cup winning team reunite in today’s match.
Virat Kohli plays for Royal Challengers Bengaluru, while 2008 U19 final Player of the Match Ajitesh Argal officiates as umpire today. pic.twitter.com/UEOCHZi8KV
— BlueGreen Planet (@De_le_Vega) April 27, 2026
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో అంపైరింగ్ అవకాశం దక్కడంతో మురిసిపోయిన అజితేశ్… తన దోస్త్ కోహ్లీని మైదానంలో కలిసినందుకు చాలా సంతోషించాడు. అప్పట్లో కలిసి ఆడిన రోజులను గుర్తు చేసుకొని.. కుశల ప్రశ్నలతో సంబురపడిపోయారిద్దరూ.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

