Vaibhav Sooryavanshi | ‘ఫొటోకు రూ.100 తీసుకుంటా’.. అభిమానులపై ఫ్రాంక్ చేసిన వైభవ్..!
Vaibhav Sooryavanshi : ప్రపంచస్థాయి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ కుర్రాడు ఎక్కడ కనపడినా సెల్ఫీ ప్లీజ్.. ఒక్క ఫొటో అని అభిమానులు గుమికూడుతున్నారు. పదిహేనేళ్లున్న వైభవ్ తన వయసుకు తగ్గ అల్లరితో ఆశ్చర్యపరుస్తున్నాడు.
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో వీరకొట్టుడుతో వైరలవుతున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఆటకు సలాం కొడుతున్నారంతా. ప్రపంచస్థాయి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ కుర్రాడు ఎక్కడ కనపడినా సెల్ఫీ ప్లీజ్.. ఒక్క ఫొటో అని అభిమానులు గుమికూడుతున్నారు. పదిహేనేళ్లున్న వైభవ్ తన వయసుకు తగ్గ అల్లరితో ఆశ్చర్యపరుస్తున్నాడు. అందులో భాగంగానే తనతో ఫొటో దిగేందుకు వచ్చిన వాళ్లతో నేను రూ.100 తీసుకుంటా అని ఈ చిచ్చరపిడుగు చెప్పాడు.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని విమానాశ్రయంలో ఇద్దరు చిన్నారులు ఫొటో అడిగారు. అందుకు అతడు ‘బ్రదర్ నేను ఫొటోకు డబ్బులు తీసుకుంటా. నేను నిజయతీగానే చెబుతున్నా. నేను వంద రూపాయలు తీసుకుంటా’ అని వారితో చెప్పాడు. అతడలా పైసలు తీసుకుంటా అనేసరికి ఆ చిన్నారులు షాకయ్యారు. వెంటనే తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి రూ.200 తీసుకొచ్చి.. వైభవ్‌కు ఇవ్వబోయారు.
Baccha party always a step ahead 😂 pic.twitter.com/locrozR0Yh
— Rajasthan Royals (@rajasthanroyals) April 27, 2026
అయితే.. తనకు డబ్బులు వద్దని, ఆటపట్టించేందుకు తాను అలా చెప్పానని అన్నాడు. ఆ తర్వాత ఫొటో దిగి వారిని సంతోషపరిచాడీ ఐపీఎల్ స్టార్. రాజస్థాన్ యాజమాన్యం ఎక్స్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఈ వీడియో చూసినవాళ్లంతా ‘క్రికెట్లో స్టార్‌గా అవతరించిన వైభవ్‌లో కుర్ర చేష్టలు పోలేదు’ అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. పంతొమ్మిదో సీజన్లో 36 బంతుల్లోనే వేగవంతమైన శతకంతో రికార్డు నెలకొల్పాడు వైభవ్ సూర్యవంశీ. ఎనిమిది మ్యాచుల్లో ఈ విధ్వంసక ఆటగాడు 234.87 స్ట్రయిక్ రేటేతో 357 రన్స్ కొట్టాడు.

భారత క్రికెట్లో శరవేగంగా దూసుకెళ్తున్న వైభవ్ సూర్యవంశీ ఆటకు రికార్డులు బద్ధలవుతున్నాయి. ఈ ఏడాది అండర్-19 వరల్డ్‌కప్‌లో భారీ శతకంతో టీమిండియాను గెలిపించిన వైభవ్.. ఐపీఎల్లో రెండో శతకం బాదేశాడు. పంతొమ్మిదో సీజన్లో బుమ్రా, సిరాజ్, కమిన్స్ లాంటి తోపు బౌలర్లను ఉతికేస్తున్న ఈ చిచ్చరపిడుగు 36 బంతుల్లో వంద కొట్టేశాడు. జైపూర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఐపీఎల్లో మూడో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు.
ఫాస్టెస్ట్ సెంచరీ వీళ్లదే..
1. క్రిస్ గేల్ (ఆర్సీబీ)- పుణేరి వారియర్స్‌పై 30 బంతుల్లో (2013లో)
2. వైభవ్ సూర్యవంశీ(రాజస్థాన్ రాయల్స్) – 35 బంతుల్లో, గుజరాత్ టైటాన్స్‌పై(2025లో)
3. వైభవ్ సూర్యవంశీ(రాజస్థాన్ రాయల్స్) – 36 బంతుల్లో, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై(2026లో)
4. యూసుఫ్ పఠాన్ (రాజస్థాన్ రాయల్స్) – 37 బంతుల్లో, ముంబై ఇండియన్స్‌పై(2010లో)
5. ప్రియాన్ష్ ఆర్య(పంజాబ్ కింగ్స్) – 38 బంతుల్లో, చెన్నై సూపర్ కింగ్స్‌పై(2025లో)
6. డేవిడ్ మిల్లర్ (కింగ్స్ లెవన్ పంజాబ్) – 38 బంతుల్లో, ఆర్సీబీపై(2013లో)
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

