పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..

Puneeth rajkumar | పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. ఈయనకు తెలుగు ఇండస్ట్రీతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ నందమూరి, మెగా కుటుంబాలతో పునీత్ రాజ్ కుమార్‌కు మంచి స్నేహం ఉంది. కేవలం ఈయనతో ఉన్న స్నేహం కోసమే జూనియర్ ఎన్టీఆర్.. పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమాలో ఒక పాట పాడాడు. ఇక మహేశ్ బాబు కూడా పునీత్ రాజ్ కుమార్ నటించిన ఒక సినిమా ఆడియో వేడుకకు వెళ్లాడు. చిరంజీవి కుటుంబంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు పునీత్. ఆయన అన్న శివ రాజ్ కుమార్ కూడా తెలుగు హీరోలకు బాగా తెలుసు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఒక్కడు సినిమా కన్నడలో అజయ్ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు.
అలాగే అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దూకుడు, ఆంధ్రావాలా లాంటి సినిమాలను కన్నడలో రీమేక్ చేశాడు పునీత్ రాజ్ కుమార్. తెలుగులో డిజాస్టర్ గా నిలిచిన ఆంధ్రావాలా సినిమా కన్నడలో వీర కన్నడిగా పేరుతో రీమేక్ ఈ సూపర్ హిట్ అయింది. అక్కడ ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి ఒకే ఒక్క కారణం పునీత్ కు ఉన్న ఫాలోయింగ్. కేవలం ఇది మాత్రమే కాదు మరికొన్ని తమిళ సినిమాలు కూడా రీమేక్ చేశాడు పునీత్. ఒరిజినల్ కంటే కన్నడలో అవి మరింత పెద్ద విజయం సాధించాయి. దానికి తోడు విభిన్నమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం కన్నడ ఇండస్ట్రీకి తీరని లోటు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Puneeth Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

