Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. రష్యా అంతటా ఉక్రెయిన్ ఏకంగా వెయ్యికిపైగా డ్రోన్లతో దాడులు జరిపింది. ఇది ఉక్రెయిన్ చరిత్రలోనే అతిపెద్ద డ్రోన్ దాడి. సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని చమురు ఎగుమతి టెర్మినల్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయగా.. భారీగా మంటలు చెలరేగాయి. రష్యాకు చెందిన రిటైల్ సంస్థ ఓజోన్‌కు చెందిన లాజిస్టిక్స్ కేంద్రం, స్థానిక టెక్నాలజీ దిగ్గజం వీకేకు చెందిన డాటా సెంటర్‌ను కూడా ఉక్రెయిన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి.
కీవ్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. రష్యా అంతటా ఉక్రెయిన్ ఏకంగా వెయ్యికిపైగా డ్రోన్లతో దాడులు జరిపింది. ఇది ఉక్రెయిన్ చరిత్రలోనే అతిపెద్ద డ్రోన్ దాడి. సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని చమురు ఎగుమతి టెర్మినల్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయగా.. భారీగా మంటలు చెలరేగాయి. రష్యాకు చెందిన రిటైల్ సంస్థ ఓజోన్‌కు చెందిన లాజిస్టిక్స్ కేంద్రం, స్థానిక టెక్నాలజీ దిగ్గజం వీకేకు చెందిన డాటా సెంటర్‌ను కూడా ఉక్రెయిన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. స్థానిక గవర్నర్ అలెగ్జాండర్ బెగ్లోవ్ మాట్లాడుతూ తమ భద్రతా దళాలు ఉక్రెయిన్ డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేశాయన్నారు.
ఈ దాడుల్లో ఒకరు మరణించగా ఐదుగురు గాయపడ్డారని తెలిపారు. ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. చమురు సంస్థలపై దాడులు అస్సలు క్షమించదగ్గవి కావన్నారు. ఇంకోవైపు ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా నగరంపై రష్యా రెండు దాడులు చేసింది. ఇందులో ఒక మహిళ మరణించగా.. ఆరేండ్ల బాలిక గాయపడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

