రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకుడు. బూసం జగన్మోహన్రెడ్డి నిర్మాత. ఇటీవలే విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ఈ సినిమా సక్సెస్మీట్ని నిర్వహించారు. చిత్ర కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘ఆడియన్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది.

గట్స్, ప్యాషన్ ఉన్న ఇలాంటి టీమ్ ఉంటేనే, ఈ తరహా విజయాలు సాధ్యమవుతాయి. నేను కమర్షియల్ సినిమాలతోపాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుండటం వల్ల ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఇవ్వగలుతున్నా. వినోదం, సందేశం రెండూ ఉన్న సినిమా ‘క్రేజీకల్యాణం” అని పేర్కొన్నారు. దసరా పండక్కి రక్తపాతాలతో కూడిన సినిమాలతోపాటు రక్తసంబంధాల కథల్ని కూడా చూస్తామని ప్రేక్షకులు రుజువు చేశారని, భావోద్వేగాలతో ప్రతి తెలుగువాడినీ కలిపే సినిమా ఇదని, రివార్డ్స్తోపాటు ఈ సినిమా అవార్డులను కూడా సాధిస్తుందని అగ్రనటుడు నరేశ్ వీకే నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!