ఫ్రాన్స్ అగ్నిగుండం
ప్రజాందోళనలతో ఫ్రాన్స్ అగ్నిగుండంలా మారింది. పెరుగుతున్న జీవన వ్యయం, పాఠశాలల్లో అధ్వాన పరిస్థితులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పారిస్‌లో టియర్‌గ్యాస్ మేఘాలు కమ్ముకోగా, దేశంలోని పలు నగరాల్లో భవనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ముసుగులు ధరించిన కొందరు నిరసనకారులు దుకాణాలను ధ్వంసం చేసి, వస్తువులను దోచుకున్నారు.
- హింసాత్మకంగా మారిన నిరసనలు
- పెరిగిన జీవన వ్యయం, బడుల్లో అధ్వాన పరిస్థితులకు వ్యతిరేకంగా తీవ్ర రూపం దాల్చిన ఆందోళనలు
- రోడ్డెక్కిన 5.5 లక్షల మంది ప్రజలు
- భవనాలకు నిప్పు.. దుకాణాలు లూటీ
- దేశ వ్యాప్తంగా 1,800 మంది ఆందోళనకారుల అరెస్ట్
పారిస్, అక్టోబర్ 18: ప్రజాందోళనలతో ఫ్రాన్స్ అగ్నిగుండంలా మారింది. పెరుగుతున్న జీవన వ్యయం, పాఠశాలల్లో అధ్వాన పరిస్థితులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పారిస్‌లో టియర్‌గ్యాస్ మేఘాలు కమ్ముకోగా, దేశంలోని పలు నగరాల్లో భవనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ముసుగులు ధరించిన కొందరు నిరసనకారులు దుకాణాలను ధ్వంసం చేసి, వస్తువులను దోచుకున్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 5.5 లక్షల మంది వీధుల్లోకి వచ్చారని, వీరిలో పారిస్‌లోనే 1.10 లక్షల మంది ఉన్నారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు. పోలీసులు 1,800 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఘర్షణల్లో 150 మంది పోలీస్ అధికారులు గాయపడినట్టు ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకొర్ను తెలిపారు. పాఠశాలల్లో పరిస్థితులు దిగజారడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనలు క్రమంగా విస్తృత ఉద్యమంగా మారాయి. ప్రభుత్వ స్పందన పట్ల అసంతృప్తితో ఉన్న కార్మిక సంఘాలు, ఇతర వర్గాలు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యాయి. హింసాకాండను ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఖండించారు. దేశంలో హింసకు చోటులేదని పేర్కొన్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

Town Hall Fire
చారిత్రక భవనానికి నిప్పు
మధ్య ఫ్రాన్స్‌లోని లిమోజెస్ నగరంలో 19వ శతాబ్దానికి చెందిన నగర పాలక సంస్థ భవనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో దాని పైకప్పు కూలిపోయింది. నిరసన తెలిపే హక్కు ప్రాథమిక హక్కు అయినప్పటికీ, హింస ద్వారా ఉద్దేశపూర్వకంగా అల్లకల్లోలం సృష్టించడాన్ని అంగీకరించబోమని మంత్రి నూనెజ్ హెచ్చరించారు. పారిస్, మార్సెయి, లియోస్, బోర్డో సహా పలు నగరాల్లో వందలాది వ్యాపార సంస్థలు లూటీకి గురయ్యాయని తెలిపారు.
బోర్డో నగరంలో లూయిస్ విట్టన్ దుకాణాన్ని నిరసనకారులు లూటీ చేయగా, లిల్లేలో యాపిల్ స్టోర్‌ను ధ్వంసం చేశారు. పారిస్‌లో దుస్తులు, ఆహార పదార్థాల దుకాణాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. పారిస్‌లోని ప్లాస్ ద లా రిపబ్లిక్ కూడలి పరిసరాల్లో ఆదివారం ఉదయం ఎక్కడ చూసినా ధ్వంసమైన దుకాణాల అద్దాలు, విరిగిపడిన రాళ్లు, చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువలే కనిపించాయి. పర్యాటక, వాణిజ్య ప్రాంతాల్లోనూ దుకాణాల లూటీ, ఆస్తుల ధ్వంసం జరిగినట్టు అధికారులు తెలిపారు. పారిస్ ప్రాంతంలోనే 885 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Attack On Tourisam Office
వలసదారులే కారణం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఘటనలపై స్పందిస్తూ.. ఫ్రాన్స్ అగ్నిగుండంలా మారిందని.. పూర్తిగా భిన్నమైన ప్రపంచం నుంచి వచ్చి, ద్వేషంతో ఉన్న వలసదారులే ఈ ఘటనలకు కారణమని ఆరోపించారు. వలసలను ప్రస్తావిస్తూ సరిహద్దులను మూసివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని సూచించారు. అయితే, వలసదారులకు ఈ హింసతో సంబంధం ఉందని ఫ్రాన్స్ అధికారులు లేదా పోలీసులు ప్రకటించలేదు. కొన్ని ఘటనలకు తీవ్ర వామపక్ష వర్గాలు, లూటీకి పాల్పడేందుకు వచ్చిన వ్యక్తులే కారణమని అధికారులు పేర్కొన్నారు. నిరసనల సందర్భంగా దెబ్బతిన్న వ్యాపార సంస్థలకు నష్టాన్ని అంచనావేయడంలో సహాయపడేందుకు అత్యవసర విభాగాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు పారిస్ మేయర్ గ్రెగ్వార్ ప్రకటించారు. నష్టంగా భారీగా ఉందని, ఇంతటి విధ్వంసం ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.

Shop Looted
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

