ఎవరూ ఊహించని విధంగా ఆకాశంలో నుంచి కొన్ని ఇనుప గోలీలు రెండు గ్రామాల్లో పడ్డాయి. వాటిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో వెలుగు చూసింది. ఇక్కడి ఖంభోలాజ్, రాంపురా, భూమేల్ గ్రామాల్లో ఈ ఇనుప గోలీలు పడ్డాయి.
ఈ నెల 12, 13 తేదీల్లో పడిన ఇవి ఒక్కోటీ కనీసం ఒకటిన్నర అడుగు వ్యాసంతో ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే చైనాకు చెందిన చాంగ్ ఝెంగ్ 3బీ అనే రాకెట్.. భూ వాతావరణంలోకి రీఎంట్రీ అవుతున్న సమయంలో వేరుపడిన శకలాలే అవి అని అమెరికాకు చెందిన ఆస్ట్రోనామర్ అంటున్నారు. అయితే ఈ మాటల్లో ఎంత వరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు.
ప్రస్తుతానికైతే ఈ ఇనుప గోలీలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి ఇస్రో సహకారం తీసుకుంటున్నామని, అలాగే అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించామని అధికారులు తెలిపారు.