బూర్గంపహాడ్, సెప్టెంబరు 05 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో ఐటీసీ, ఐవోజీ సంస్థ ఆధ్వర్యంలో గర్భిణులకు శనివారం ఉచిత వైద్య శిబిరంతో పాటు సీమంతాలు నిర్వహించారు. మోరంపల్లిబంజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు నగేష్ ఈ శిబిరానికి హాజరై గర్భిణులకు పరీక్షలు నిర్వహించి తల్లీబిడ్డ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. గర్భిణులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు. అనంతరం సీమంతాలు నిర్వహించి చీరలు, పండ్లు అందించి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్పీ వెంకటనర్సమ్మ, హెచ్ఎ వెంకట్, ఐజీవో కుసుమ, ఎంఎల్హెచ్పీ జ్యోతి, ఏఎన్ఎంలు నాగదేవి, సుజాత, ఐజీవో సభ్యులు, ఆశాలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.