– వెంపటి సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య
తుంగతుర్తి, సెప్టెంబర్ 05 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి మండలం వెంపటి గ్రామ సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య అన్నారు. శనివారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ కార్డులను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లబ్ధిదారుల పూర్తి వివరాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. స్మార్ట్ కార్డులు పొందిన లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్డుల పంపిణీతో అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ దాసరి మంజుల రామచంద్రు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాదరబోయిన రవి, వార్డు సభ్యులు ఏర్పుల మహేష్, పుల్లూరు సాయమ్మ, పులిగుజ్జ నరసయ్య, మూరగుండ్ల వీరయ్య, సింగిల్ విండో డైరెక్టర్ పులిగుజ్జ యాకయ్య, మాజీ సర్పంచ్ లు అబ్బగాని పద్మ సత్యనారాయణ గౌడ్, తునికి సాయిలు, కొండగడుపుల నాగయ్య, కొండ వెంకన్న, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తప్పట్ల శంకర్, దాయం ఝాన్సీ రాజిరెడ్డి, యామగాని భిక్షం, భాషబోయిన వెంకన్న, కొండ వెంకన్న, పూల్లూరు రమేష్, దేవరపు రమేష్, డీలర్లు అబ్బగాని రాణి, పుల్లూరు వేణు పాల్గొన్నారు.