Ishan Kishan | షమీలో వికెట్ల ఆకలి తగ్గలే.. పునరాగమనంపై ఆశ చావలే..!
Ishan Kishan : ఎప్పుడైనా పిలుపు రాకపోతుందా? అనే ఆశతో నెట్టుకొస్తున్న షమీ వందో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ పరిస్థితుల్లో షమీ గురించి నార్త్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్(Ishan Kishan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Ishan Kishan : భారత పేస్ దళంలో విశేష సేవలందించిన మహమ్మద్ షమీ (Mohammed Shami) జాతీయ జట్టుకు దూరమై ఏడాది దాటింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం అతడి కెరీర్ అక్కడే ఆగిపోయింది. గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్ (Domestic Cricket)లో వికెట్ల వేటతో రాణిస్తున్నా సరే అతడిని మాత్రం సెలెక్టర్లు పక్కన పెట్టేస్తున్నారు. ఎప్పుడైనా పిలుపు రాకపోతుందా? అనే ఆశతో నెట్టుకొస్తున్న ఈ సీనియర్ పేసర్ వందో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ పరిస్థితుల్లో షమీ గురించి నార్త్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీలో ఆశ చావలేదని, అతడు పునరాగమనం కోసం ఎదురు చూస్తున్నాడని ఇషాన్ అన్నాడు.
దులీప్ ట్రోఫీలో అదరగొడుతున్న మహమ్మద్ షమీ కెరీర్లో వందో ఫస్ల్ క్లాస్ మ్యాచ్ ఆడబోతున్నాడు. సెమీఫైనల్లో ఐదు వికెట్లతో నార్త్ జోన్ (North Zone) ఫైనల్ చేరడంలో కీలకమైన షమీ ఆదివారం టైటిల్ పోరులోనూ చెలరేగాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నార్త్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. షమీ పునరాగమనం కోసం తీవ్రంగా కష్టపడుతున్నాని పేర్కొన్నాడు.
“I feel I see that hunger in him”
Ishan Kishan on East Zone team-mate Mohammed Shami pic.twitter.com/ZgLlCO1wdh
— Cricinfo (@cricinfo) September 5, 2026
‘గొప్ప బౌలర్లలో షమీ ఒకడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడొక లెజెండ్. బెంగాల్ తరఫున ఆడుతున్నప్పుటి నుంచి మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీస్తున్నాడు. జట్టు విజయం కోసం తన శక్తినంతా ధారపోస్తున్నాడు. భారత క్రికెట్ జట్టు తరఫున కూడా షమీ గొప్పగా రాణించాడు. వయసు గురించి చెప్పాలంటే అది ఒక అంకె మాత్రమే. బౌలర్‌గా రాణిస్తున్నంత కాలం వయసు పెద్ద సమస్య కాదు. అతడిలో పునరాగమనం చేయాలనే కోరిక చావలేదు. ఈ సీజన్లో అతడు కొత్తగా కనిపిస్తున్నాడు. ఉత్సాహం పరంగానే కాదు వికెట్లు తీయాలనే ఆకలి అతడిలో ఇసుమంతైనా తగ్గలేదు. అలాంటి బౌలర్ ఉంటే ఏ కెప్టెన్‌కైనా సంతోషమేగా’ అని ఇషాన్ పేర్కొన్నాడు.
🇮🇳 | Mohammed Shami was presented with a special jersey to mark his 100th First-Class game.
📷 @Fancricket12 | #DuleepTrophy pic.twitter.com/pX9iRgYYOw
— CricketGully (@thecricketgully) September 5, 2026
మూడు ఫార్మాట్లలో మొనగాడే
దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే 903 వికెట్లు తీసిన షమీ.. పునరాగమనంపై అటు సెలెక్టర్లు, ఇటు బీసీసీఐ మౌనం దాలుస్తున్నాయి. దాంతో.. వచ్చే వన్డే ప్రపంచకప్ స్క్వాడ్ ఎంపిక వరకూ అతడు ఎదురు చూసి.. ఎంపికవ్వకుంటే వీడ్కోలు పలికే అవకాశముంది. 2023 వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్న షమీ.. టెస్టుకు దూరమై మూడేళ్లు దాటింది. 2025 మార్చి 9న న్యూజిలాండ్‌తో వన్డే అతడికి ఆఖరు కాగా.. అదే ఏడాది ఫిబ్రవరి 2న ఇంగ్లండ్‌తో టీ20 ఆడిన ఈ స్పీడ్‌స్టర్ మళ్లీ స్క్వాడ్‌లోకి రాలేదు. మూడు ఫార్మాట్లలో షమీ ఇప్పటివరకూ 462 (వన్డేల్లో 206, టెస్టుల్లో 219, టీ20ల్లో 27) వికెట్లు పడగొట్టాడు.
That is absolutely jaw-dropping! Mohammed Shami just pulled off a stunning, one-handed reflex catch off his own bowling to dismiss Harsh Dubey during the ongoing 2026 Duleep Trophy semi-final. pic.twitter.com/78wiiEHXSz
— 🏏Cricket-Soccer⚽ Nostalgiation (@RiteshJ88156274) September 1, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

