Pakistan | బీఎల్ఏ దాడిలో 25 మంది పాక్ సైనికులు మృతి.. స్పందించని పాక్
Pakistan : తాజాగా బీఎల్ఏ జరిపిన దాడిలో 25 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ విషయాన్ని బీఎల్ఏ తాజాగా వెల్లడించింది. పాక్ దాడులకు బదులుగా, బీఎల్ఏ జరిపిన వేర్వేరు దాడుల్లో పాక్ సైనికులు మరణించినట్లు తెలిపింది.
Pakistan : పాకిస్తాన్లో కొంతకాలంగా పాక్ సైన్యానికి, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)కు మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరుపక్షాలు పరస్పరం దాడి చేసుకుంటున్నాయి. తాజాగా బీఎల్ఏ జరిపిన దాడిలో 25 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ విషయాన్ని బీఎల్ఏ తాజాగా వెల్లడించింది. పాక్ దాడులకు బదులుగా, బీఎల్ఏ జరిపిన వేర్వేరు దాడుల్లో పాక్ సైనికులు మరణించినట్లు తెలిపింది.
దీంతో బెలూచిస్తాన్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా బీఎల్ఏ రిలీజ్ చేసింది. బీఎల్ఏకు చెందిన ఫతేహ్ స్క్వాడ్ ఈ దాడి చేసినట్లు ప్రకటించింది. శుక్రవారం జియారత్ క్రాస్ వద్ద పాక్ మిలిటరీ కాన్వాయ్‌కు చెందిన రెండు వాహనాలు వెళ్తుండగా బీఎల్ఏ దాడి చేసింది. ఈ ఘటనలో 18 మంది పాక్ సైనికులు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఫతేహ్ స్క్వాడ్.. బీఎల్ఏలో చాలా బలమైన సాయుధ రెబల్ గ్రూప్. బెలూచిస్తాన్ పర్వత ప్రాంతాల్లో, గ్వెరిల్లా తరహా మెరుపు దాడులు చేయగల సామర్ధ్యం ఈ గ్రూప్ సొంతం.
ప్రమాదకరమైన దాడుల్ని ఈ గ్రూప్ చేపడుతుంది. గత ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసింది కూడా ఈ గ్రూపే. మరో ఘటన సూరబ్ పరిధిలోని హజికా ప్రాంతంలో జరిగింది. బీఎల్ఏకు చెందిన ఎస్టీఓఎస్ గ్రూపు పాక్ సైన్యంపై దాడి చేసింది. రిమోట్ కంట్రోల్ వాహనంతో దాడి చేయగా, ఏడుగురు సైనికులు మరణించారు. ఈ రెండు దాడులపై పాక్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈ ఘటనలు పాక్ సైన్యం వైఫల్యంగా అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైఫల్యంగా స్థానికులు ఆరోపిస్తున్నారు.
పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెలూచిస్తాన్‌లో కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. బలూచ్ పౌరులు తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. పాక్ ప్రభుత్వం నుంచి విముక్తి కావాలని కోరుకుంటూ పోరాటం చేస్తున్నారు. అయితే, పాక్ ప్రభుత్వం మాత్రం ఈ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Balochistan
- BLA
- Pakistan
- soldiers
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

