వెనకటికి అంటే పెళ్లిళ్లు.. ఊళ్లలోనే ఫిక్స్ అయ్యేవి. తెలిసిన వాళ్ల ద్వారా సంబంధాలు చూసేవారు. కానీ..ఇప్పుడు మాట్రిమోనీలు.. పెళ్లిళ్ల బ్రోకర్లు.. రిక్వైర్మెంట్స్, ఆస్తులు, అంతస్థులు అన్నీ చూస్తున్నారు. చివరకు తాము పెళ్లి చేసుకోబోయే వాళ్లు ఎలా ఉండాలో ఆ రిక్వైర్మెంట్స్ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. ఒక్కటి తక్కువైనా ఏమాత్రం సంకోచించకుండా నో చెప్పేస్తున్నారు.
తాజాగా ఓ మాట్రిమోనీ యాడ్ కూడా అలాగే ఉంది. ప్రస్తుతం ఆ యాడ్ విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యాడ్‌లో పెళ్లి కూతురు కావాలని.. ఆ పెళ్లి కూతురు బాడీ పార్ట్స్ కొలతలు కూడా ఎంత ఉండాలో యాడ్‌లోనే చెప్పారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో ఆ యాడ్‌ను పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బెటర్ హాఫ్ అనే మాట్రిమోనీ సైట్లో ఆ యాడ్‌ను పోస్ట్ చేశారు. తన బ్రెస్ట్ సైజ్, నడుము సైజ్, తన హైట్, ఎంత బరువు ఉండాలి.. లాంటి రిక్వైర్మెంట్స్ను ఆ యాడ్‌లో పోస్ట్ చేశారు.
అయితే.. బ్రెస్ట్ సైజు, నడుము సైజు ఎంతుండాలో కొలతలు తీసుకొని మరీ పెళ్లి చేసుకుంటావా? ఆడపిల్లలు అంటే బొమ్మలు అనుకుంటున్నావా? అంటూ నెటిజన్లు ఆ యాడ్‌ను పోస్ట్ చేసిన వ్యక్తిపై భగ్గుమంటున్నారు. ఇతడికి ఓ బార్బీ బొమ్మను ఇస్తే సరిపోతుంది. ఆ రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా బొమ్మకు ఉంటాయి, వీడేమన్నా టైలరా? కొలతలు చెబుతున్నాడు.. అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఆ యాడ్‌పై బెటర్‌హాఫ్ మాట్రిమోనీ సంస్థ కూడా స్పందించింది. ఆ యూజర్ కంపెనీ రూల్స్‌ను బ్రేక్ చేశాడని.. వెంటనే అతడిపై యాక్షన్ తీసుకుంటామని ట్విట్టర్లో వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Amazon Marijuana Scandal : గంజాయి స్కామ్‌లో బుక్కయిన అమెజాన్.. నెటిజన్ల ఫన్నీ మీమ్స్ వైరల్
బీరు గ్లాస్ ఎలా కిందపడిపోయిందో ఈ వీడియో చూసి చెప్పండి చూద్దాం
ఇదేందయ్యా ఇది.. జీవితంలో ఇటువంటి యాక్సిడెంట్‌ను ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో