అర్వపల్లి, సెప్టెంబర్ 28 : ఖమ్మంలో ఈ నెల 28, 29, 30 తేదీలలో జరుగు అఖిల భారత రైతుకూలీ సంఘం జాతీయ మహాసభలకి జాజిరెడ్డిగూడెం మండలం నుండి ఏఐకేఎంఎస్, సీపీఐ ఎంఎల్, న్యూడెమోక్రసి నాయకులు సోమవారం బయల్దేరి వెళ్లారు. ఏఐకేఎంఎస్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత రైతాంగంపై కార్పొరేట్, భూస్వాములు అనుకూల దాడుల పరంపరను కొనసాగిస్తున్నాయన్నారు. అధికారంలో ఉన్న పాలకవర్గ పార్టీలు వాగ్దానాలు, ప్రచారానికి పరిమితమయ్యాయని తెలిపారు. నిరంతర దాడులను బహిర్గతం చేయడం, ప్రజల్లోకి తీసుకెళ్లడం, వాటికి వ్యతిరేకంగా పోరాటం తమ కర్తవమని తెలిపారు. భారత వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని, మూడు వ్యవసాయక చట్టాలు రైతులను పెద్ద ఎత్తున వారి జీవనోపాధి నుండి వేరు చేసి, వారి జీవనాధారాన్ని లాక్కోవాలనే లక్ష్యంతో చేయబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలేబోయిన కిరణ్, ఊర సంపత్, లక్ష్మీనారాయణ, శ్రీహరి, మధుకర్, శ్రీను, లింగయ్య, మల్లేశ్ పాల్గొన్నారు.