Law Students Suspended | కాలేజీ విద్యార్థినులను వేధించినందుకు.. ముగ్గురు న్యాయ విద్యార్థులను సస్పెండ్ చేసిన యూనివర్శిటీ
Law Students Suspended | రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు కాలేజీ విద్యార్థినులను కారులో ఫాలో అయిన ముగ్గురు లా స్టూడెంట్స్ వేధించారు. వారిని బలవంతంగా కారులోకి లాగేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీతో పాటు క్యాంపస్ నుంచి వారిని సస్పెండ్ చేశారు.
న్యూఢిల్లీ: రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు కాలేజీ విద్యార్థినులను కారులో ఫాలో అయిన ముగ్గురు లా స్టూడెంట్స్ వేధించారు. వారిని బలవంతంగా కారులోకి లాగేందుకు ప్రయత్నించారు. ఆ మహిళల ఫిర్యాదు నేపథ్యంలో న్యాయ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీతో పాటు క్యాంపస్ నుంచి వారిని సస్పెండ్ చేశారు. (Law Students Suspended). దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 23న రాత్రి 9.30 గంటల సమయంలో హిందూ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ముఖర్జీ నగర్ ప్రాంతంలో నడుస్తుండగా ముగ్గురు వ్యక్తులు వారిని వేధించారు. ఆ మహిళలను తమ కారులోకి బలవంతంగా లాగేందుకు ప్రయత్నించారు. వారు ప్రతిఘటించడంతో పారిపోయారు.
కాగా, ఈ సంఘటనపై ఆ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ నిందితులను నమన్, అభినవ్ కుమార్, అభిమన్యు కుమార్‌గా గుర్తించారు. లా స్టూడెంట్స్ అయిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ చేశారు.
మరోవైపు ఎల్ఎల్బి చదువుతున్న న్యాయ విద్యార్థులపై కేసు నమోదుతో పాటు వారి అరెస్ట్‌పై ఢిల్లీ యూనివర్సిటీ స్పందించింది. నమన్, అభినవ్ కుమార్, అభిమన్యు కుమార్ ప్రవర్తనను తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్య చర్యగా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు లా స్టూడెంట్స్‌ను సస్పెండ్ చేయడంతోపాటు క్యాంపస్ నుంచి నిషేధించింది. వారి సస్పెన్షన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.
BREAKING: Hindu College student & friend harassed in Mukherjee Nagar at 9:30 PM.
White Safari stops. Lewd comments. Abuse. Car follows. Men try to drag them inside.
Hours spent at multiple police stations. FIR delayed.
Accused identified as DU Law Faculty student. Claims… pic.twitter.com/lVwCqcLJdo
— Amar Singh Chouhan (@amar_4inc) September 25, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

