బెంగళూర్ : ఐటీ సిటీగా పేరొందిన బెంగళూర్‌లో ఎటు వైపు చూసినా టెకీల సందడి కనిపిస్తుంది. బెంగళూర్‌కు చెందిన వ్యక్తి ఇటీవల తన ఊబర్ మోటో డ్రైవర్ (Uber Moto) గూగుల్ మాజీ ఉద్యోగి అని తెలియడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. రాఘవ్ దువా అనే వ్యక్తి తన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో యూజర్లు సైతం తమకు ఎదురైన ఇలాంటి అనుభవాల గురించి వెల్లడించడంతో నెట్టింట ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
తమ బైక్-ట్యాక్సీ డ్రైవర్‌కు టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు బెంగళూర్ వ్యక్తి గుర్తించడం ఇదే తొలిసారి కాదు. ఇక తాజా ఘటన విషయానికి వస్తే రాఘవ్ దువా ఇటీవల బెంగళూర్ వీధుల్లో తిరిగేందుకు ఊబర్ బైక్‌ను బుక్ చేసుకున్నాడు. ఆపై తన డ్రైవర్ గూగుల్ మాజీ ఉద్యోగి అని గుర్తించాడు. మాజీ గూగుల్ ఉద్యోగి నెలకిందటే బెంగళూర్‌కు వచ్చాడు.
నగరంలో విస్తృతంగా తిరిగేందుకు అతడు ఈ బాటను ఎంచుకున్నాడు. నా ఊబర్ మోటో డ్రైవర్ గూగుల్ మాజీ ఉద్యోగి..అతడు హైదరాబాద్ నుంచి 20 రోజుల కిందటే బెంగళూర్ వచ్చాడు..నగరంలో కలియతిరిగేందుకు అతడు ఈ పనిచేస్తున్నాడని రాఘవ్ దువా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Read More :
Fawad Ahmed | ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఇంట తీవ్ర విషాదం.. నాలుగు నెలల చిన్నారి మృతి