Diamonds : ఇది కదా లక్కు అంటే.. ఆ రైతు పొలంలో వజ్రాల పంట..
ఇది కదా లక్కు అంటే | ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. రెండు సంవత్సరాల వ్యవధిలో ఏకంగా ఆరు సార్లు ఆ రైతుకు తన భూమిలో వజ్రాలు దొరికాయి
ఎవరి పొలంలో అయినా వడ్లు పండుతాయి. లేదంటే.. పత్తి పండుతుంది. కందులు, పెసళ్లు పండుతాయి. కానీ.. ఈ రైతు భూమిలో మాత్రం ఏకంగా వజ్రాలే పండుతున్నాయి. నమ్మశక్యంగా లేదు కదా. కానీ.. అదే నిజం.

ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. రెండు సంవత్సరాల వ్యవధిలో ఏకంగా ఆరు సార్లు ఆ రైతుకు తన భూమిలో వజ్రాలు దొరికాయి. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన రైతు ప్రకాశ్ మజుందార్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. జరూర్‌పూర్ అనే గ్రామంలో ఆ రైతుకు భూమి ఉంది.
తన భూమిలో వజ్రాలు ఉన్నాయని తెలుసుకున్న ప్రకాశ్.. గత రెండేళ్ల నుంచి అక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి తవ్వకాలు చేపడుతున్నాడు. మొన్నటి వరకు ఆయనకు 5 డైమాండ్స్ దొరికాయి.
తాజాగా మరో డైమాండ్.. 6.47 క్యారెట్ల బరువు ఉన్న వజ్రం దొరికింది. దాని విలువ సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందట. దీంతో మరోసారి ఆ రైతు పంట పండింది.
అయితే.. తనకు దొరికిన వజ్రాన్ని వెంటనే అక్కడి ప్రభుత్వ డైమాండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు ప్రకాశ్. దాన్ని అక్కడ వేలం వేస్తారు. వేలం వేస్తే వచ్చే డబ్బులో ప్రభుత్వ రాయల్టీలు, టాక్స్‌లు పోను.. మిగితాది ఆ రైతుకు ఇస్తారట. అలా వచ్చిన డబ్బును.. తనకు తవ్వకాల్లో సాయం చేసిన తన ఫ్రెండ్స్ అందరూ సమానంగా పంచుకుంటారట.
గత సంవత్సరం.. ప్రకాశ్‌కు 7.44 క్యారెట్ల వజ్రం దొరికిందట. అలాగే.. 2 నుంచి 2.5 క్యారెట్ల బరువు ఉన్న వజ్రాలు కూడా ఆయనకు దొరికాయి. పన్నా జిల్లాలో సుమారు 12 లక్షల క్యారెట్ల వజ్రాల నిల్వ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అందుకే.. అక్కడ భూములు ఉన్న రైతులకు తవ్వకాలు జరుపుకునే పర్మిషన్ ఇచ్చి.. ఒకవేళ డైమాండ్ దొరికితే.. ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాలని అధికారులు చెబుతుంటారు. భూములు లేని రైతులకు.. ప్రభుత్వమే లాండ్ లీజుకు ఇస్తుంది. లీజుకు ఇచ్చిన ప్రదేశంలో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుకోవచ్చు. డిపాజిట్ చేసిన వజ్రాన్ని వేలం వేస్తారు. దాని ద్వారా వచ్చిన డబ్బును డైమాండ్‌ను డిపాజిట్ చేసిన రైతులను అందజేస్తారు. ఒకవేళ ఎవరైనా రైతు తనకు దొరికిన వజ్రాన్ని డిపాజిట్ చేయకపోతే.. వాళ్లపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Shopping Bag : ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే?
Pregnant Cat : గర్భంతో ఉన్న పిల్లిని కాపాడారు.. 10 లక్షల రివార్డు పొందారు
Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Chain Snatching : పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. మహిళ మెడలోని చైన్‌ను ఎత్తుకెళ్లారు.. వీడియో
తన పెళ్లికి రాలేదని.. ఓ అతిథికి రూ.17 వేల బిల్ పంపించిన నవ వధువు
Slippers :72 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని.. బయటికి వచ్చాక ‘నా చెప్పులు ఏవి?’ అని అడిగాడు
Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

