Shopping Bag : ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే?
ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే | చాలామందికి పిష్వీ అంటే అర్థం కాలేదు. పిష్వీ అనేది మరాఠీ పదం. మరాఠీలో పిష్వీ అంటే తైలీ అని అర్థం. తైలీ అంటే తెలుసు కదా
సాధారణంగా ఒక బ్యాగ్ దర ఎంతుంటుంది. లేడీస్ బయటికి వెళ్లినప్పుడు వాడే బ్యాగులు అయినా.. షాపింగ్ బ్యాగులు అయినా.. ఏవైనా సరే.. మా అంటే ఓ వెయ్యి రూపాయలు వేసుకోండి. లేదంటే.. కొంచెం క్వాలిటీవి అయితే.. ఓ రెండు మూడు వేలు ఏసుకోండి. సరే.. ఓ పది వేల కంటే మాత్రం ఎక్కువైతే ఉండవు కదా.
కానీ.. ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన ఈ షాపింగ్ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. మీ కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ బ్యాగ్ ధర అక్షరాలా రూ.1.53 లక్షలు. డాలర్లలో అయితే.. 2090 డాలర్లు.
ఈ బ్యాగ్‌ను లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ Balenciaga ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. అయితే.. ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్.. ఆ బ్యాగ్‌ను స్క్రీన్ షాట్ తీసి తన అకౌంట్లో షేర్ చేసి.. Balenciaga బ్రాండ్ pishviని యూఎస్ డాలర్స్ 2000కు అమ్ముతున్నారు.. నేను ఇప్పటి వరకు ఇంత ఖరీదైన బ్యాగును చూస్తానని కలలో కూడా అనుకోలేదు.. అని పోస్ట్ చేశాడు.
అలాగే.. ఎవరైనా మరాఠీ ఫ్రెండ్ ఉంటే.. వాళ్లకు ఈ పోస్ట్‌ను టాగ్ చేసి pishvi అంటే ఏంటో అడగండి.. అని అతడు పోస్ట్ పెట్టడంతో.. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
చాలామందికి పిష్వీ అంటే అర్థం కాలేదు. పిష్వీ అనేది మరాఠీ పదం. మరాఠీలో పిష్వీ అంటే తైలీ అని అర్థం. తైలీ అంటే తెలుసు కదా. మన భాషలో సంచి.. ఇంగ్లీష్‌లో అయితే క్యారీ బ్యాగ్. చాలామంది మరాఠీలు.. మార్కెట్లో సరుకులు కొన్నాక.. ఇంటికి వచ్చి సంచులను మంచం పరుపు కింద దాస్తారట. ఆ ఉద్దేశంతోనే ఆ వ్యక్తి మంచం కింద దాచే ఈ సంచి 1.5 లక్షల రూపాయలా? అన్నట్టుగా ఆ పోస్టును పెట్టడం.. నెటిజన్లను బాగా ఆకర్షించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Pregnant Cat : గర్భంతో ఉన్న పిల్లిని కాపాడారు.. 10 లక్షల రివార్డు పొందారు
Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Chain Snatching : పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. మహిళ మెడలోని చైన్‌ను ఎత్తుకెళ్లారు.. వీడియో
తన పెళ్లికి రాలేదని.. ఓ అతిథికి రూ.17 వేల బిల్ పంపించిన నవ వధువు
Slippers :72 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని.. బయటికి వచ్చాక ‘నా చెప్పులు ఏవి?’ అని అడిగాడు
Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


