బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో వలకు ఓ వింత జీవి చిక్కింది. నిజానికి.. అది చూడటానికి అచ్చం మొసలిలాగానే ఉంది కానీ.. దాని మూతి మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది. సన్నగా.. పొడుగ్గా సన్నని కర్రలా తన మూతి ఉండటంతో.. ఇదేంటి.. అని అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు దాన్ని ఫోటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదేదో వింత జంతువులా ఉంది.. ఏంటిది.. అంటూ ట్వీట్ చేశారు.
దీంతో ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బెగుసరాయ్‌లోని ఖోడబండ్పూర్ బ్లాక్ ఏరియాలో ఉన్న గందక్ నదిలో వలలో ఇది చిక్కింది… అంటూ ట్వీట్ చేయడంతో.. ఆ ట్వీట్‌పై ఓ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పర్వీన్ కశ్వాన్ స్పందించాడు.
అరె బాబూ.. దాంట్లో వింతేముంది. అది సాధారణ మొసలి. కాకపోతే ఒక రకమైన జాతికి చెందిన మొసలి. అందుకే దాని తల భాగం సన్నగా.. పొడుగ్గా ఉంటుంది. ఈ జాతి మొసళ్లు.. గందక్, చంబల్, గంగా, రామ్ గంగా, గిర్వా, యమునా నదుల్లో ఉంటాయి.. అని ఆ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చాడు.
बेगूसराय के खोदाबन्दपुर प्रखण्ड क्षेत्र में बूढ़ी गंडक नदी में लगाये गए जाल में फंसा अजीबोगरीब जलीय जीव #thebegusarai pic.twitter.com/TzsTaps1t9
— द बेगूसराय (@thebegusarai) September 2, 2021
దీంతో నెటిజన్లు కూడా ఆయన రిప్లయిని చూసి.. అవును అవును.. నిజమే.. అది మొసలినే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
अजीबोग़रीब इसमें क्या है। ये तो एक आम घरियाल है। गंडक, चम्बल, गंगा, रामगंगा, गिरवा, यमुना जैसी अनेक नदियों में पाया जाता है। https://t.co/3bOZff5iXz
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 3, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Video : ఈ ఏనుగును చూసి ఎంతో నేర్చుకోవాలి.. ఎందుకో ఈ వీడియోలో చూడండి
Viral Video : ఫేస్ మాస్క్ పెట్టుకొని బికినీలో యువతి.. ఎయిర్‌పోర్ట్‌లో హల్చల్
ఆ ఊళ్లో మహిళలకు ఒక భాష.. పురుషులకు మరో భాష.. ఒకే ఊరిలో రెండు భాషలు